• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాబాయి మూవీ ప్రీ రిలీజ్...

బాబాయి మూవీ ప్రీ రిలీజ్ వేడుక అబ్బాయి చీఫ్‌ గెస్ట్‌

By - Tupaki Desk
Update: 2021-11-20 12:37 GMT
నందమూరి హీరో బాలకృష్ణ అఖండ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 27 లేదా 28న నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయట. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా వస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడు అనే విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ కు ఆయన సన్నిహితుడు. అలాగే బాబాయి కోసం అబ్బాయి ఎన్టీఆర్ ఎప్పుడు అయినా వచ్చేందుకు సిద్దంగానే ఉంటాడు. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా నిర్మాతలు ఆహ్వానించారనే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ విదేశీ పర్యటన గురించిన వార్తలు వస్తున్నాయి. కనుక అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఎంత వరకు కనిపించబోతున్నాడు అనేది చివరి వరకు సస్పెన్స్ గానే ఉండబోతుంది. ఇక ఎన్టీఆర్‌ మాత్రమే కాకుండా ఈ ప్రిరిలీజ్ వేడుకలో యంగ్‌ హీరో నాచురల్‌ స్టార్ నాని కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇటీవల బాలయ్యతో కలిసి అన్ స్టాపబుల్‌ లో నాని పాల్గొన్నాడు. ఇద్దరి మద్య సరదా ముచ్చట్లు కొనసాగాయి. ఆ సమయంలోనే నాని ని బాలకృష్ణ అఖండ ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించారనే వార్తలు వస్తున్నాయి. అందుకు నాని కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. నాని మరియు ఎన్టీఆర్‌ లు ఒకే సారి బాలయ్యతో స్టేజ్ మీద ఉంటే ఖచ్చితంగా అభిమానులకు కన్నుల పండుగ అనడంలో సందేహం లేదు. మరి ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుంది అనేది మరో వారం రోజులు ఆగితే కాని తెలియదు.

ఇక బాలయ్య అఖండ సినిమా విషయానికి వస్తే ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌ గా నటించగా పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతుంది. బాలయ్య ద్వి పాత్రాభినయం చేశాడు. జగపతి బాబు మరియు శ్రీకాంత్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్‌కు ఈ సినిమా సెకండ్‌ ఇన్నింగ్స్ అవ్వబోతుంది. ఆయన ఈ సినిమా తో పూర్తి స్థాయి విలన్ గా ఎంట్రీ ఇచ్చా ముందు ముందు వరుసగా విలన్ వేశాలు వేయాలనుకుంటున్నాడు. బాలయ్య.. బోయపాటిల కాంబోలో గతంలో వచ్చిన లెజెండ్ సినిమా తో జగపతిబాబు సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి విలన్‌ గా స్టార్‌ డమ్‌ దక్కించుకుని ఇప్పుడు ఏ రేంజ్ లో సినిమా లు చేస్తున్నాడో తెల్సిందే. మరి శ్రీకాంత్‌ కు కూడా అదే రిపీట్‌ అవుతుందా అనేది చూడాలి.
Tags:    
  • Ju Ntr 
  • Srikanth 
  • Akhanda Event 
  • Nani 
  • Nandamuri Balakrishna 
  • Unstoppable talk 
  • Akhanda 
  • NBK 
  • Shyam Singha Roy 
  • Nani 
  • RRR 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS