మరోసారి యునిఫామ్ వేస్తున్నావా తారక్?
ఇప్పుడు ఎన్టీఆర్ 'జై లవ కుశ' ఇచ్చిన రిలీఫ్‌ను ఎంజాయ్ చేస్తూ చక్కగా యురోప్ ట్రిప్ కోసం సర్వం సిద్దం అయిపోతున్నాడు. ఈ ట్రిప్పుకు వెళ్ళే ముందే మనోడు తన తదుపరి సినిమా త్రివిక్రమ్ డైరక్షన్లో ఉండోబోతందని.. ఆ సినిమా కోసం కొత్త ఫిజిక్ ప్రయత్నిస్తున్నానని చెప్పేశాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ చేయబోయే రోల్ చాలా ప్రత్యేకం అంటున్నారు కొందరు సన్నిహితులు.
ఆల్రెడీ రెండు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు తారక్. టెంపర్ అండ్ బాద్షా సినిమాలో పోలీస్ పాత్రలో బాగానే ఇంప్రెస్ చేశాడు. అయితే ఈసారి మాత్రం పోలీస్ అధికారి యునిఫామ్ కాకుండా.. దేశానికే గర్వకారణమైన ఖాకీ.. ఆర్మీ డ్రెస్ వేయనున్నాడట. త్రివిక్రమ్ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మనోడు ఆర్మీ జవాన్ లేదా కమాండర్ గా కనిపిస్తాడని ఒక ప్రముఖ పత్రిక సెలవిచ్చింది. ఇకపోతే ఎన్టీఆర్ గతంలో శక్తి సినిమాలో కూడా ఇదే తరహాలో ఒక స్పెషల్ కమాండో పాత్రలో మెరిశాడు.. కాని రిజల్టే తేడా కొట్టేసింది.
ఇక ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ సినిమాలో అను ఎమ్మానుయేల్ హీరోయిన్ అంటూ ఎప్పటినుండో వింటున్నాం. కాని ఈ మధ్యనే కొత్తగా ఇలియానా మరియు యామీ జాక్సన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి జనవరిలో మొదలయ్యే ఈ సినిమా చుట్టూ అప్పుడే రూమర్లు రాకెట్లు వేసుకుని చక్కెర్లు కొట్టడం విశేషం. వీటిలో ఏది నిజం అంటారు?