NTR30 : చివరకు అదే కన్ఫర్మ్‌ చేస్తారేమో

Update: 2020-09-02 04:00 GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్‌ తదుపరి సినిమా త్రవిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ విషయమై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ నిలిచి పోయింది. అది పునః ప్రారంభం అయ్యి పూర్తి అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్టీఆర్‌ 30వ సినిమా రూపొందబోతున్న ఈ సినిమాకు ఇప్పటికే త్రివిక్రమ్‌ 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగిందట.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ టైటిల్‌ ను హారిక అండ్‌ హాసిన బ్యానర్‌ పై రిజిస్ట్రర్‌ చేయించాడట. అయితే సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌ లో విడుదల చేయాలని భావిస్తున్నారు కనుక ఆ టైటిల్‌ అన్ని భాషలకు వర్కౌట్‌ అవ్వదని తెలుగులో ఒక టైటిల్‌ ఉంటే ఇతర భాషల్లో ఇతర టైటిల్స్‌ పెట్టడం వల్ల ప్రమోషన్‌ ఇబ్బంది అవుతుందని కొందరు అనుకున్నారు. సినిమా ప్రారంభం అయ్యి ఫస్ట్‌ లుక్‌ సమయంలో టైటిల్‌ విషయంలో పునరాలోచిస్తారనే ప్రచారం జరిగింది. కాని యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ఏదైతే టైటిల్‌ రిజిస్ట్రర్‌ చేయించారో అదే టైటిల్‌ తో ముందుకు వెళ్లాలనుకుంటున్నారట.

త్రివిక్రమ్‌ ఏ టైటిల్‌ అయినా కథకు సూట్‌ అయ్యేలా ఖరారు చేస్తాడు. ఈ సినిమా విషయంలో కూడా ఆయన బాగా ఆలోచించిన తర్వాతే టైటిల్‌ పెట్టి ఉంటాడు. కనుక టైటిల్‌ విషయంలో మరో నిర్ణయంకు అవకాశం లేదనే టాక్‌ వినిపిస్తుంది. వచ్చ ఏడాది నుండి సినిమాను ప్రారంభించి అదే ఏడాది చివర్లో లేదా 2022 ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చు అంటున్నారు.
Tags:    

Similar News