• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైరల్ వీడియో: మంజూ...

వైరల్ వీడియో: మంజూ వారియర్‌కు షాకింగ్ ఇన్సిడెంట్

| మలయాళ లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ అంటే కేరళలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.

By - Madhu Reddy
Update: 2026-04-06 17:58 GMT

మలయాళ లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ అంటే కేరళలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, ఇటీవల పాలక్కాడ్‌లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆమెకు ఒక వింత అనుభవం ఎదురైంది. ఒక మహిళా అభిమాని అత్యుత్సాహంతో నటిపైకి వచ్చి బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో ఈ ఇన్సిడెంట్ మరోసారి నిరూపించింది.

వేదికపై ఊహించని పరిణామం:

పాలక్కాడ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు మంజు వారియర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె అభిమానులతో ఎంతో ఓపికగా సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో ఒక మహిళా అభిమాని ఒక్కసారిగా మంజు వద్దకు వచ్చి, ఆమె లిప్ కిస్ బలవంతంగా ముద్దు పెట్టుకుంది. ఇక ఈ ఊహించని చర్యతో మంజు వారియర్ ఒక్క క్షణం నిశ్చేష్టురాలయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి ఆ మహిళను పక్కకు లాగాల్సి వచ్చింది.

యాంకర్ ఆగ్రహం.. అభిమాని సమర్థన:

ఈ ఘటనతో అక్కడున్న యాంకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్టేజ్ పైనే సదరు మహిళా అభిమానిపై మండిపడుతూ, సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని హెచ్చరించారు. అయితే, ఆ మహిళ మాత్రం ఏమాత్రం తగ్గకుండా.. "నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టం, ఆ ప్రేమతోనే ముద్దు పెట్టుకున్నాను తప్ప నా ఉద్దేశం తప్పు కాదు" అంటూ తన ప్రవర్తనను సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. ఈ సంభాషణ అక్కడ కాసేపు గందరగోళానికి దారితీసింది.

మంజు వారియర్ హుందాతనం:

సాధారణంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా కోప్పడటం సహజం. కానీ మంజు వారియర్ మాత్రం తన సంస్కారాన్ని చాటుకున్నారు. ఆ ఘటనతో కాస్త షాక్‌కు గురైనా, ఏమాత్రం చిరాకు పడకుండా చిరునవ్వుతోనే పరిస్థితిని చక్కదిద్దారు. ఇక ఆ తర్వాత కూడా మిగిలిన అభిమానులతో ఏమాత్రం విసుగు లేకుండా సెల్ఫీలు దిగి, అందరినీ పలకరించి అక్కడి నుంచి వెళ్లారు. ఆమె చూపిన ఈ సహనంపై ఇప్పుడు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

నెట్టింట చర్చనీయాంశమైన భద్రత:

ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా అభిమానే కదా అని కొందరు అంటుంటే, జెండర్ ఏదైనా సరే ఒకరి అనుమతి లేకుండా అలా తాకడం లేదా ముద్దు పెట్టుకోవడం ముమ్మాటికీ తప్పేనని మెజారిటీ నెటిజన్లు మండిపడుతున్నారు.ఇక ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో సెలబ్రిటీల భద్రత మరియు వారి 'పర్సనల్ స్పేస్' గురించి ఈ ఘటన మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

అభిమానం అనేది గుండెల్లో ఉండాలి కానీ, ఎదుటివారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. మంజు వారియర్ తన హుందాతనంతో ఈ విషయాన్ని పెద్దది చేయకుండా వదిలేసినా, సదరు అభిమాని ప్రవర్తన మాత్రం విమర్శలకు గురవుతోంది. ఇక సెలబ్రిటీలను దేవుళ్లలా ఆరాధించే క్రమంలో కనీస 'సివిక్ సెన్స్' పాటించడం అవసరమని ఈ ఘటన మనకు గుర్తు చేస్తోంది. ఏదేమైనా మంజు వారియర్ ఓపికకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.


A woman fan kissed actress Manju Warrier on the lips 😮
🙏🏃#Manjuwarrier #Actress #Mollywood pic.twitter.com/k8Eyz3CAAj

— ananthu___ (@AnanthuBackup) April 5, 2026


Tags:    
  • manjuwarrier 
  • manjuwarrierfan 
  • celebrityfanbehavior 
  • fanmoment 
  • controversy 
  • socialmedia 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS