రానా.. ఊపిరి పీల్చుకోవచ్చు
దగ్గుబాటి రానా కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ ఆగస్టు 4నే రావాల్సింది. కానీ ఇండిపెండెన్స్ డే వీకెండ్ అయితే వసూళ్లు బాగుంటాయని ఆగస్టు 11కు షెడ్యూల్ చేశారు. ఆ రోజుకు తెలుగులో ఇంకో రెండు సినిమాలు పోటీలో ఉన్నా వెనక్కి తగ్గలేదు. ఐతే ఇక్కడ రిలీజ్ డేట్ ఖరారు చేశాక పెద్ద చిక్కొచ్చి పడింది. ఇది తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల కావాల్సిన సినిమా. ఐతే ఆగస్టు 10న తమిళంలో అజిత్ మూవీ ‘వివేగం’ను విడుదల చేయాలనుకున్నారు. ఆ సినిమా అదే తేదీకి వస్తే అంతే సంగతులు. ‘వివేగం’పై అంచనాలు ఆకాశాన్నంటుతుండటంతో రానా సినిమాను తమిళ ప్రేక్షకులు పట్టించుకోవడం కష్టమే. దీంతో ఆగస్టు 11న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను రిలీజ్ చేసే విషయంలో తర్జన భర్జన పడ్డారు.
ఐతే రానా అండ్ టీంకు ఊరటనిచ్చే కబురు ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ రోజే సెన్సార్ పూర్తి చేసుకున్న ‘వివేగం’ సినిమాను ఆగస్టు 10 రిలీజ్ చేయట్లేదు. రెండు వారాలు ఆలస్యంగా ఆగస్టు 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ‘నేనే రాజు నేనే మంత్రి’ టీం ఖుషీ చేసుకోవచ్చు. 11నే తెలుగుతో పాటు తమిళంలో హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. తమిళంలో ‘నాన్ ఆనయిట్టాల్’ (నేను ఆదేశిస్తే) అనే పేరుతో విడుదలవుతోంది ‘నేనే రాజు నేనే మంత్రి’. ‘బాహుబలి’.. ‘ఘాజీ’ లాంటి సినిమాలతో రానా తమిళ ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. కాజల్ కూడా అక్కడి వాళ్లకు బాగానే పరిచయం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రానా తండ్రి సురేష్ బాబు నిర్మించారు.