సినీ ఇండస్ట్రీని కూడా కాస్త పట్టించుకుంటే బాగుంటుంది...!
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక సూక్ష్మజీవి చేతిలో చిక్కి విలవిలలాడిపోతోంది. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడిన రంగాలలో సినీరంగం ఒకటి. భారతీయ సినీ చరిత్రలో ఇండస్ట్రీ ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. సినిమా షూటింగులు ఆగిపోయాయి. గత రెండు నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతబడి ఉన్నాయి. దీంతో ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేక జీవనం సాగించడం కష్టంగా మారింది. అయితే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం ఈ మధ్య కొన్ని రంగాలకు కాస్త మినహాయింపులు ఇస్తూ వస్తోంది. కానీ వినోద రంగం లాంటి వాటికి మాత్రం ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. సాధారణ పరిస్థితులు వస్తే థియేటర్స్ ఓపెన్ అవుతాయని.. షూటింగ్స్ మళ్లీ మొదలుపెట్టుకోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఎంటర్టైన్మెంట్ లో ముఖ్యపాత్ర పోషిస్తున్న సినిమాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గని నేపథ్యంలో థియేటర్లు తెరిస్తే సమస్య తీవ్రమవుతుందని.. ప్రజలు కూడా థియేటర్లకు వచ్చే ఆలోచన చేస్తారని అనుకోవటం లేదని.. అందుకే కనీసం మరో 3 లేదా 4 నెలల పాటు థియేటర్లు తెరిచే ఉద్దేశం లేదని ప్రభుత్వాలు ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పరిస్థితులు చక్కబడితే షూటింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చన్న వారిని షాక్ కి గురి చేసింది. ఇప్పటికే మన టాలీవుడ్ కి ఈ సంక్షోభం వలన సుమారు 500 కోట్లు నష్టం వాటిల్లిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటిలో గవర్నమెంట్ కి వెళ్లాల్సిన సుమారు 100 కోట్ల మేర ఆదాయం ఆగిపోయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా సినిమాపై ఆధారపడి జీవిస్తున్న దాదాపుగా 50 వేల కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలు ముందుకొచ్చినప్పటికీ ఆ సాయం కొంతమేర మాత్రమే భరోసా కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అన్నిటికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ షూటింగ్ లకు కూడా పర్మిషన్ ఇవ్వాలని ఇండస్ట్రీ పెద్దలు విన్నవించుకుంటున్నారట. సినీ ఇండస్ట్రీని కూడా కాస్త పట్టించుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ ని కోరుతున్నారట.