ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆర్ ఆర్ ఆర్ టీం తృప్తిపర్చడం ఎలా?
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అతి పెద్ద మల్టీస్టారర్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ మూడు వంతులకు పైగా పూర్తి అయ్యింది. లాక్ డౌన్ లేకుండా ఉంటే షూటింగ్ దాదాపుగా ముగింపు వచ్చేది. ఈ నెలలో షూటింగ్ ను జక్కన్న పూర్తి చేయాలనుకున్నాడట. కాని లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా షూటింగ్స్ అన్నీ బంద్ ఉన్నాయి. అయినా కూడా ముందు నుండి అంటున్నట్లుగా సినిమాను సంక్రాంతికి తీసుకు వస్తామని నమ్మకంగా నిర్మాత చెబుతున్నాడు. కాని ఎన్టీఆర్ బర్త్ డే కు మాత్రం వీడియోను విడుదల చేయడం కష్టం అంటున్నారట.
గత నెలలో చరణ్ బర్త్ డే సందర్బంగా రామరాజు వీడియోను విడుదల చేసిన జక్కన్న భీం వీడియోను కూడా విడుదల చేయాలనుకున్నాడు. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది అవుతుందట. అంతా ఇంటికే పరిమితం అవుతున్న ఈ సమయంలో ఎన్టీఆర్ వీడియో మేకింగ్ సాధ్యం అయ్యేలా లేదట. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మరోరకంగా సంతృప్తి పర్చాలనే ఉద్దేశ్యం తో జక్కన్న అండ్ టీం ప్రయత్నాలు చేస్తున్నారట.
వీడియో విడుదల చేయలేని ఈ సమయంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ లుక్ పోస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. బర్త్ డే సందర్బంగా ఎన్టీఆర్ పోస్టర్ మాత్రమే విడుదల చేసి లాక్ డౌన్ తర్వాత ఎప్పుడు రెడీ అయితే అప్పుడే వెంటనే ఎన్టీఆర్ కొమురం భీమ్ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారా లేదంటే జక్కన్నపై విరుచుకు పడతారో చూడాలి.