ఎన్టీఆర్ బయోపిక్: ఏది నిజం ఏది అబద్ధం?

Update: 2018-11-05 06:28 GMT
నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి.  'కథానాయకుడు'.. 'మహానాయకుడు' టైటిల్స్ తో రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ బయోపిక్ గురించి రీసెంట్ గా కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈమధ్య రాజకీయాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ స్క్రిప్ట్ ను మారుస్తున్నారని కథనాలు వచ్చాయి.  ఒకవేళ అలా స్క్రిప్ట్ లో మార్పులు చేసే పక్షంలో ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజయ్యే అవకాశం లేదని అన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా టైట్ షెడ్యూల్స్ లో సాగుతోంది. మరి ఈ వార్తలు నిజమేనా? 'ఎన్టీఆర్' టీమ్ కు సన్నిహితంగా ఉండేవారు ఈ వార్తలను ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు.  సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు లాక్ చేసిన స్క్రిప్ట్ లో ఒక్క అక్షరం.. పదం కూడా  మార్చడం లేదని.. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు అనుకున్న సమయానికే రావడం ఖాయమని అంటున్నారు.

ఈ లెక్కన 'ఎన్టీఆర్ కథానాయకుడు' జనవరి 9 న.. 'ఎన్టీఆర్ మహానాయకుడు' ముందు అనుకున్నట్టే జనవరి 24 న రిలీజ్ అవుతాయి.  ఎలాగూ ఇప్పుడు నవంబర్ లో ఉన్నాం కాబట్టి త్వరలో టీజర్ ట్రైలర్లు ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నాన్నగారి లుక్స్ తోనే అందరినీ చంపేసిన బాలయ్య టీజర్ ట్రైలర్లతో డబిడిదిబిడి చేయడం ఖాయమే. 
Tags:    

Similar News