రాకాలో పాన్ ఇండియా స్టార్ల సందడి.. ఏం ప్లాన్ గురూ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘రాకా’ సినిమా అప్‌డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘రాకా’ సినిమా అప్‌డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అంతర్జాతీయ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్యాస్టింగ్ పరంగా రోజురోజుకూ మరింత క్రేజీగా మారుతోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ పవర్‌ఫుల్ డాన్ చుట్టూ సాగే ఈ కథ కోసం డైరెక్టర్ అట్లీ పక్కా పాన్ ఇండియా ప్లాన్‌తో వేరే భాషల స్టార్స్ అందరినీ ఒకే చోటకి తెస్తున్నారు. ఆ విశేషాలు ఇలా వున్నాయి ..
కన్నడ, మలయాళ స్టార్స్ ఎంట్రీ:
ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు ఇతర భాషల నటులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన గోల్డెన్ స్టార్ గణేష్ ఈ మూవీలో ఒక పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. అలాగే, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ కూడా రీసెంట్‌గానే ‘రాకా’ షూటింగ్ యూనిట్‌లో జాయిన్ అయ్యారు. ఇక పాత్రలు ఎక్కువగా ఉంటూ, మంచి ఎమోషన్స్ ఉండే ఈ కథలో వచ్చే షెడ్యూల్ నాటికి మరో యంగ్ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతోందట.
ముగ్గురు ముద్దుగుమ్మల గ్లామర్ హంగామా:
‘రాకా’ సినిమాలో హీరోయిన్ల లైన్ అప్ చూస్తేనే మేకర్స్ ప్లానింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. ఇందులో మెయిన్ హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పడుకోణె నటిస్తోంది. ఇక ఆమెతో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌లలో క్రేజ్ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్, అలాగే గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా మరో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో మాఫియా డ్రామా:
ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ వారు అత్యున్నత సాంకేతిక విలువలతో, ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్‌ను రంగంలోకి దించి ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఇక అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇలా సౌత్ టు నార్త్ అన్ని ఇండస్ట్రీల స్టార్స్ ‘రాకా’ ప్రాజెక్ట్‌లోకి జాయిన్ అవుతుండటంతో, ఇది కేవలం ఒక సినిమా లాగ కాకుండా ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ కొల్లాబ్రేషన్‌లా కనిపిస్తోంది. అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రాబోతున్న ఈ మాఫియా డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. బన్నీ ఫ్యాన్స్‌కు మాత్రం థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ..