• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా సంక్రాంతి మూవీపై...

మెగా సంక్రాంతి మూవీపై సస్పెన్స్‌ వీడినట్లేనా?

| 2027 సంక్రాంతికి చిరంజీవి ‘కాకా’ సినిమాతో రావడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవగా, డిసెంబర్ 1 నుంచి 40 రోజుల ప్రమోషన్ షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు టాక్. మరోవైపు వీఎఫ్‌ఎక్స్ పనుల ఆలస్యం కారణంగా ‘విశ్వంభర’ 2027 సమ్మర్‌కు వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

By - Ramesh Palla
Update: 2026-11-16 08:21 GMT

2027 సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి 'కాకా' సినిమాతో రాబోతున్నట్లు చాలా నెలల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వాల్తేరు వీరయ్య సైతం సంక్రాంతి కానుకగా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కాకా సినిమాకు సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందని అంతా భావించారు. కాకా సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన మెగా ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తూ 2027 సంక్రాంతికి చిరంజీవి సినిమా రావడం పక్కా, కానీ కాకా కాకుండా విశ్వంభర రాబోతుందనే వార్తలు గుప్పుమన్నాయి. విశ్వంభర సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం చేసిన సినిమా కనుక విశ్వంభర కు మంచి రెస్పాన్స్ దక్కుతుందని భావిస్తున్నారనే వార్తలు వచ్చాయి. విశ్వంభర పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ సైతం పూర్తి అయినట్లుగా వార్తలు రావడంతో సంక్రాంతికి పక్కాగా వస్తుందని మెగా ఫ్యాన్స్ భావించారు.

చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్‌...

చిరంజీవి 'విశ్వంభర' సినిమా గత ఏడాది సంక్రాంతికి రావాల్సింది. కానీ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా 2027 సంక్రాంతికి వస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ 2027 సంక్రాంతికి కూడా విశ్వంభర రావడం కష్టమే అన్నట్లుగా పరిస్థితి ఉందట. ఆ మధ్య డబ్బింగ్‌ పనులు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కనుక విడుదల ఉంటుందని భావించారు. కానీ 2027 సమ్మర్‌ వరకు విశ్వంభర వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. 2027 సంక్రాంతికి ముందుగా అనుకున్నట్లుగా కాకా సినిమాతోనే చిరంజీవి రాబోతున్నాడని కన్ఫర్మ్‌ అయింది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావడంతో పాటు, మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. కనుక సినిమాను సంక్రాంతికి విడుదల చేసి తీరుతాం అని కాకా యూనిట్‌ సభ్యులు బల్ల గుద్ది మరీ చెబుతున్నట్లు మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

జనవరి 12 విడుదల రిలీజ్‌కి సిద్దం...

సంక్రాంతికి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'జనవరి 12 విడుదల' సైతం రాబోతున్న విషయం తెల్సిందే. సంక్రాంతి అనగానే అనిల్ రావిపూడి సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. వరుసగా రెండు ఏళ్లు బక్లాక్‌ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్నాడు. సంక్రాంతి సినిమాల స్పెషలిస్ట్‌ అని అనిల్ రావిపూడికి పేరు పడింది. అందుకే అనిల్‌ రావిపూడి సినిమాతో పోటీ పడాలంటే కచ్చితంగా కాస్త ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ అవసరం అని బాబీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్‌ 1 నుంచి మెల్లగా కాకా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నాడట. ముందుగానే దాదాపు 40 రోజులకు సంబంధించిన ప్రమోషన్‌ షెడ్యూల్‌ ను దర్శకుడు అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేసినట్లుగా సినీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్‌ లో టాక్‌ వినిపిస్తోంది.

చిరంజీవి కాకా సినిమా ప్రమోషన్స్‌...

కాకా సినిమాలో చిరంజీవి లుక్‌తో పాటు, ఆయన పాత్ర ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్ కి నచ్చుతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్‌ కి చేరువ అయ్యేలా కామెడీ స్కిట్స్‌ చేస్తూ, హీరోయిన్స్‌ తో చిట్‌ చాట్‌ చేయిస్తూ, ఆన్‌ లొకేషన్‌ ఫన్నీ సంఘటనలు క్రియేట్‌ చేసి, వాటిని విడుదలకు ముందు వదలడం ద్వారా కాకా సినిమాపై ఆసక్తి పెంచాలని యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను ప్రమోట్‌ చేయడం కోసం ఏకంగా నలుగురు సభ్యుల టీం ఒకటి నిరంతరం వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అనిల్‌ రావిపూడి, ఇతర ఫిల్మ్‌ మేకర్స్ అనుసరించిన విధానాలతో పాటు, కొత్తగా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యే విధంగా డిసెంబర్‌ 1 నుంచి కాకా సినిమా ప్రమోషన్స్‌ షురూ చేయబోతున్నారు. డిసెంబర్‌ నుంచి కాకా ప్రమోషన్స్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 2027 సంక్రాంతి కి రాబోతున్న మెగా మూవీ పై సస్పెన్స్ వీడినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, మెగా ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటున్నారు.

Tags:    
  • chiranjeevi 
  • kaaka 
  • vishwambhara 
  • sankranthi2027 

Similar News

మసక చీకటిలో..మైనస్ 7 డిగ్రీల చలిలో!

2026-11-16 08:12 GMT

తమిళ బాక్సాఫీస్‌పై ధనుష్ ఫోకస్.. పాన్ ఇండియా లెవల్లో మాస్ ప్లాన్!

2026-11-16 08:12 GMT

'ఆకాశంలో ఒక తార' ట్రైలర్: అమ్మాయి స్పేస్ డ్రీమ్ వెనుక దుల్కర్!

2026-11-16 07:59 GMT

పదేళ్ల సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన దిశా పటాని!

2026-11-16 07:58 GMT

సల్మాన్ ఖాన్- మాధురి దీక్షిత్ మంచం విరిగే సీన్ వెనుక నిజం!

2026-11-16 07:58 GMT

ఐకాన్ స్టార్‌కు పెరుగుతున్న క్రేజ్.. రోజుకు ఏకంగా 7 కోట్లు!

2026-11-16 07:58 GMT

ట్రెడిషనల్ లుక్‌లో తళుక్కుమన్న సిమ్రాన్ చౌదరి

2026-11-16 07:57 GMT

వెంకటేష్ ఆ దర్శకులకు అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదుగా?

2026-11-16 07:56 GMT

విజయ్ బయోపిక్‌.. హీరోగా జేసన్ సంజయ్..!

2026-11-16 07:55 GMT

ఒకేరోజు 100 సిగరెట్లు కాల్చాను.. సంచలన నిజం బయటపెట్టిన అలియా తల్లి!

2026-11-16 07:54 GMT

పాన్ ఇండియా విజయాల వెనుక పర్ఫెక్షన్.. చిన్న విషయం కోసం కూడా వందల టేక్స్!

2026-11-16 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS