• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సల్మాన్ ఖాన్- మాధురి...

సల్మాన్ ఖాన్- మాధురి దీక్షిత్ మంచం విరిగే సీన్ వెనుక నిజం!

| సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ నటించిన 1994 క్లాసిక్ ‘హమ్ ఆప్కే హై కౌన్’లో మంచం విరిగిపోయే కామెడీ సీన్ వెనుక నిజ జీవిత సంఘటన ఉందని దర్శకుడు సూరజ్ బర్జాత్యా వెల్లడించారు. తన 13వ ఏట ఓ పెళ్లిలో చూసిన ఘటనను గుర్తుపెట్టుకుని, సినిమా స్క్రిప్ట్‌లో ఈ సన్నివేశాన్ని చేర్చినట్లు ఓ టాక్ షోలో తెలిపారు.

By - Srikanth Kontham
Update: 2026-11-16 07:58 GMT

బాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ క్లాసికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన చిత్రం `హమ్ ఆ.ప్కే హై కౌన్`. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ జంటగా సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఎంత‌గానో అల‌రించింది. ముఖ్యంగా చిత్రంలో సల్మాన్- మాధురిల మధ్య వచ్చే సరదా సన్ని వేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా న‌వ్విస్తాయి. అలాంటి మెమరబుల్ స‌న్నివేశాల్లో ఇదొక‌టి.

ఇద్దరూ ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ చెప్పుల కోసం పరుగెత్తుతూ అకస్మాత్తుగా మంచంపై పడిపోవడం.. ఆ బరువుకి మంచం విరిగిపోవడం. ఈ స‌ర‌దా సీక్వెన్స్ అప్ప‌టి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఈ ఐకానిక్ సీన్ సినిమా కోసం రాసుకున్న కల్పిత సన్నివేశం కాదని సూరజ్ బర్జాత్యా నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగానే తెర‌కెక్కించిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఓ టాక్ షోలో సూరజ్ బర్జాత్యా ఈ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసారు. `నేను 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ముంబైలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజ‌ర‌య్యాను. ఆ పెళ్లి వేడుకలో ఒక అమ్మాయి తన కజిన్‌ను కొట్టడంతో..కోపంతో అతడు ఆ అమ్మాయి వెనుక పరుగెత్తాడు. ఆ సరదా పరుగులాటలో ఇద్దరూ ఊహించని విధంగా అక్కడున్న ఒక మంచంపై పడిపోయారు. ఆ దెబ్బకు ఆ మంచం ఒక్కసారిగా విరిగిపోయింది.

చిన్నతనంలో చూసిన ఆ రియల్ లైఫ్ సంఘటన నా మనసులో బలంగా నాటుకుపోయింది. సంవత్సరాల తరువాత `హమ్ ఆప్కే హై కౌన్` సినిమా స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో మ‌ళ్లీ ఆ నాటి ఘటన గుర్తుకొచ్చింది. దాంతో అదే సీన్‌ను సల్మాన్ ఖాన్- మాధురి దీక్షిత్ లపై వినోదాత్మకంగా మలచగా అది థియేటర్లలో రికార్డ్ స్థాయి విజయాన్ని సాధించిందన్నారు

1994లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసింది. ఈ సినిమా భారతీయ సినిమా కుటుంబ విలువలకు కొత్త నిర్వచనం చెప్పింది. సినిమాలో పాటలు.. సన్నివేశాలు ఇన్నేళ్లయినా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవడానికి ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా ఓ కారణమని చెప్పొచ్చు. దర్శకుడు పంచుకున్న క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్యాక్‌స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాత సినిమాల్లో స‌న్నివేశాల్లో ఎంతో రియ‌లిస్టిక్ గా ఉండేవ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. యాక్ష‌న్..రొమాన్స్ ఏదైనా పెద్ద‌గా టెక్నాల‌జీ అందుబాటులో లేక‌పోయినా? ఆ స‌న్నివేశాల‌ను ఎంతో వాస్త‌వికంగా చిత్రీక‌రించి ప్రేక్ష‌కుల్ని మెప్పించేవారు. కానీ నేడు టెక్నాల‌జీ అందుబాటులో ఉన్నా? అంత రియ‌లిస్టిక్ గా స‌న్నివేశాలు అనిపించ‌డం లేద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.

Tags:    
  • humaapkehainkoun 
  • salmankhan 
  • madhuridixit 
  • soorajbarjatya 
  • bollywood 

Similar News

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS