• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకటేష్ ఆ దర్శకులకు...

వెంకటేష్ ఆ దర్శకులకు అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదుగా?

| వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘జనవరి 12 విడుదల’ సినిమా చేస్తున్నారు. గతంలో తరుణ్ భాస్కర్, తేజలతో సినిమాలు చేయాలనుకున్నా అవి పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులతో ప్రాజెక్టులు లేనట్టుగా తెలుస్తోంది. మరోవైపు గోపీచంద్ మలినేని చెప్పిన కథపై వెంకటేష్ కొన్ని మార్పులు సూచించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

By - Gopi Velupala
Update: 2026-11-16 07:56 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఫ్యామిలీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఆయన, అడపదడపా యాక్షన్ సినిమాలను చేస్తూ మాస్ ఆడియన్స్ ని సైతం తన వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సబ్జెక్టులు చేయకపోయిన ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. రీసెంట్ గా 'ఆదర్శ కుటుంబం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 'జనవరి 12 విడుదల' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది...

ఆ ఇద్దరు దర్శకులను పక్కన పెట్టినట్టేనా?

వెంకటేష్ ఒక దర్శకుడి పనితీరు నచ్చితే వాళ్లను ఇంటికి పిలిచి మన కాంబోలో మూవీ చేద్దాం స్టోరీ రెడీ చేసుకోమని చెబుతాడు. అలాంటి వెంకటేష్ 'పెళ్లి చూపులు' తర్వాత తరుణ్ భాస్కర్ తో సినిమా చేస్తానని చెప్పాడట. అలాగే 'నేను రాజు నేను మంత్రి' మూవీ తర్వాత తేజ డైరెక్షన్ లో మూవీ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. దాంతో అటు వెంకటేష్ తన సినిమాల్లో బిజీగా ఉంటే ఇటు తరుణ్ భాస్కర్ నటుడిగా రాణిస్తూనే దర్శకుడిగా 'ఈనగారానికి ఏమైంది' మూవీ కి సీక్వెల్ చేస్తున్నాడు. ఇక తేజ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. రానా తో రెండు సంవత్సరాల కిందట 'రాక్షస రాజా' అనే మూవీ స్టార్ట్ చేశాడు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. దాంతో రానా తన తదుపరి ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండగా, తేజ మాత్రం కొత్త కథ రాసుకునే పనిలో ఉన్నాడు. మొత్తానికైతే వెంకటేష్ లైనప్ చూస్తే తరుణ్ భాస్కర్, తేజ లతో సినిమాలు చేసే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది.

వెంకటేష్ లైనప్ లో ఉన్న డైరెక్టర్స్

రీసెంట్ గా వెంకటేష్ కొంతమంది దర్శకులు చెప్పిన కథలను వింటున్నాడట. అందులో గోపీచంద్ మలినేని సైతం ఒక స్టోరీ చెప్పాడనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వెంకటేష్ కి నచ్చినప్పటికి కొన్ని చేంజెస్ చెప్పాడట. ప్రస్తుతం బాలయ్య సినిమాతో బిజీగా ఉన్న గోపీచంద్ మలినేని వెంకటేష్ కథ మీద కూడా తన రైటర్స్ తో కూర్చున్నట్టుగా తెలుస్తోంది. వీళ్లిద్దరి కాంబోలో ఇప్పటికే బాడీగార్డ్ మూవీ వచ్చింది. అనుకున్న రిజల్ట్ ఇవ్వకపోయిన గోపీచంద్ డైరెక్షన్ కి ఇంప్రెస్ అయిన వెంకటేష్ తనతో మరో సినిమా చేయడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు. కానీ వెంకటేష్ కి వేరే కమిట్ మెంట్స్ ఉండటం వల్ల అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు సాధ్యమవుతుందేమో చూడాలి...

Tags:    
  • venkatesh 
  • gopichandmalineni 
  • tarunbhascker 
  • teja 
  • telugucinema 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS