• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తేజ సజ్జ ఎంగేజ్‌మెంట్‌.....

తేజ సజ్జ ఎంగేజ్‌మెంట్‌.. ఆ బాండింగ్ ఇప్పటికీ అలాగే!

| యంగ్ హీరో తేజ సజ్జ నిశ్చితార్థం సోమవారం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు రవితేజ, శ్రీకాంత్, రానా దగ్గుబాటి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తేజ వివాహం జరగనున్నట్లు సమాచారం.

By - M Prashanth
Update: 2026-11-16 11:07 GMT

యంగ్ హీరో తేజ సజ్జ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పబోతున్నారు. సోమవారం హైదరాబాద్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆయన ఎంగేజ్‌మెంట్ సింపుల్ గా, గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోల ఎంట్రీ వైరల్ వ మారింది. ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా తనకున్న పాత పరిచయాలకు తేజ ఎంత విలువ ఇస్తారో అర్థమవుతుంది.

ఈ ఎంగేజ్‌మెంట్ కు రవితేజ, శ్రీకాంత్, రానా దగ్గుబాటి హాజరై తేజకు శుభాకాంక్షలు తెలిపారు. అయ్యప్ప మాలలో నల్లటి దుస్తుల్లో శ్రీకాంత్ రాగా, రవితేజ క్యాజువల్ చెక్స్ షర్ట్ లో, రానా వైట్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో కనిపించారు. వీరంతా ఈవెంట్ లోకి ఎంట్రీ ఇస్తున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

నిజానికి తేజ సజ్జకు సీనియర్ హీరోలతో ఉన్న బాండింగ్ ఇప్పటిది కాదు. చిన్నప్పుడే బాలనటుడిగా చిరంజీవి, వెంకటేశ్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఆయన నటించారు. 'ఇంద్ర', 'కలిసుందాం రా', 'యువరాజు' లాంటి హిట్ సినిమాల్లో తేజ కనిపించారు. ముఖ్యంగా శ్రీకాంత్ సినిమాలలోనూ నటించినప్పటి నుంచే వీళ్ల మధ్య మంచి పరిచయం ఉంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న వాళ్లు ఆ తర్వాత హీరోలుగా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. కానీ తేజ సజ్జ తనకంటూ ఒక డిఫరెంట్ రూట్ సెట్ చేసుకున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన 'జాంబీ రెడ్డి'తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని, 'హనుమాన్'తో పాన్ ఇండియా లెవల్ లో భారీ హిట్ కొట్టారు. ఆ తర్వాత 'మిరాయ్'తో తన మార్కెట్ ను మరింత పెంచుకున్నారు.

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా తేజ తన పర్సనల్ లైఫ్ ను ఎప్పుడూ ప్రైవేట్ గానే ఉంచుతారు. అమెరికాలో పెరిగిన, సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని అమ్మాయితో పెద్దలు ఈ పెళ్లి కుదిర్చారు. హైదరాబాద్ లో జరిగిన ఈ నిశ్చితార్థానికి సినీ ప్రముఖులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా హాజరయ్యారు. ఇక వీరి పెళ్లి వేడుక డిసెంబర్ నెలలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది. ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఈ యంగ్ హీరో నెక్ట్స్ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.



Actor #Srikanth at the #TejaSajja Engagement ceremony ! #TejaSajjaEngagement #Tollywood #Tupaki Follow👉 @tupaki_official https://t.co/i3e4hKU5Ie

— Tupaki (@tupaki_official) November 16, 2026



#MegaStar #Chiranjeevi makes a majestic entry at the #TejaSajjaEngagement ! #TejaSajja #Tollywood #Tupaki Follow👉 @tupaki_official https://t.co/ikMTimzU9K

— Tupaki (@tupaki_official) November 16, 2026



Natural Star #Nani Makes a Stylish Entry at #TejaSajja’s Engagement Ceremony! #TejaSajjaEngagement #Tollywood #Tupaki Follow👉 @tupaki_official https://t.co/vFXDLmNgHZ

— Tupaki (@tupaki_official) November 16, 2026


Tags:    
  • tejasajja 
  • raviteja 
  • rana 
  • srikanth 
  • tejasajjaengagement 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS