అప్పుడే 60 ఏళ్ల హీరోతో రొమాన్స్!

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే ఏ యువ హీరోయిన్ అయినా ?తొలుత క్రేజ్ ఉన్న యంగ్ హీరోలతో జతకట్టాలనే ఆశపడుతుంది.

Update: 2026-06-25 09:30 GMT

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే ఏ యువ హీరోయిన్ అయినా ?తొలుత క్రేజ్ ఉన్న యంగ్ హీరోలతో జతకట్టాలనే ఆశపడుతుంది. కెరీర్ ఆరంభంలోనే సీనియర్ స్టార్ల సరసన నటిస్తే ఎక్కడ ?సీనియర్ హీరోయిన్ ముద్ర పడిపోతుందోనని, యంగ్ హీరోల అవకాశాలు చేజారిపోతాయోనని చాలామంది భామలు భయపడుతుంటారు. అందుకే సీనియర్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కెరీర్ గ్రాఫ్ దెబ్బతింటుందనే సాకుతో సున్నితంగా తిరస్కరిస్తుంటారు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ ఫార్ములాను బ్రేక్ చేస్తూ కొందరు ముద్దుగుమ్మలు బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

టాలీవుడ్‌లో ఇటీవల ఎంట్రీ ఇచ్చి గ్లామర్, నటనతో కుర్రకారు మనసులు దోచుకున్న నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సరిగ్గా ఇలాంటి అడుగులే వేస్తోంది. తెలుగులో నాలుగైదు చిత్రాల్లో న‌టించిన భామ కెరీర్ ఆరంభంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అరవై ఏళ్ల వయసున్న లెజెండరీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ భారీ ప్రాజెక్ట్‌లో కథానాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ సౌత్ ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా నార్త్ నుంచి వచ్చే హీరోయిన్లు కమర్షియల్ సక్సెస్, స్టార్ ఇమేజ్ ఉన్న యువ హీరోల వెంటే పడతారు. కానీ భాగ్యశ్రీ మాత్రం కథలోని ప్రాధాన్యతను ప్రాజెక్ట్ స్కేల్‌ను నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మోహన్‌లాల్ లాంటి నటనారేంద్రుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే కేవలం రొమాన్స్ మాత్రమే కాదు. నటిగా తనలోని ప్రతిభను నిరూపించుకోవడానికి అదొక గొప్ప అవకాశంగా భావించి ఉండొచ్చు. మాలీవుడ్‌లో ఇలాంటి క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడం భాగ్యశ్రీ కెరీర్‌కు విలక్షణమైన మలుపు అనే చెప్పాలి.

అయితే మలయాళంలో మోహన్‌లాల్ వంటి సీనియర్ మోస్ట్ స్టార్‌తో జతకట్టడానికి ఓకే చెప్పిన ఈ భామ.. ఇప్పుడు టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలు ఇప్పటికీ వరుస పెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. వీరి చిత్రాలకు హీరోయిన్ల ఎంపిక అనేది ఎప్పుడూ మేకర్స్‌కు ఒక సవాల్‌గా మారుతూనే ఉంటుంది. తాజాగా భాగ్యశ్రీ బోర్సే సీనియర్ల వైపు మొగ్గు చూపడంతో టాలీవుడ్ సీనియర్ మేకర్స్ కన్ను కూడా ఆమెపై పడే అవకాశం పుష్కలంగా ఉంది.

ఒకవేళ టాలీవుడ్ సీనియర్ స్టార్స్ కనుక భాగ్యశ్రీని సంప్రదిస్తే అమ్మ‌డు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఓకే చెప్పేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోహన్‌లాల్ సినిమాతో సీనియర్ హీరోల సరసన నటించడానికి ఉన్న అడ్డంకులను అధిగమించింది కాబట్టి చిరంజీవి వంటి లెజెండ్స్ పక్కన నటించే ఛాన్స్ వస్తే అసలు వదులుకోకపోవచ్చు. దీనివల్ల అమ్మ‌డికి యంగ్ హీరోలతో పాటు, మరోవైపు సీనియర్ టాప్ స్టార్ల సినిమాల్లోనూ అవకాశాలు లభించి టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారే స్కోప్ ఉంది.

ఏదేమైనా? కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి భిన్నమైన పంథాను ఎంచుకోవడం భాగ్యశ్రీ బోర్సే ధైర్యానికి నిదర్శనం. రొటీన్ గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇమేజ్ పరిమితులను దాటి అన్ని వర్గాల హీరోలతో నటించడానికి సిద్ధపడటం ఆమె సుదీర్ఘ కెరీర్‌కు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. మరి మాలీవుడ్ సీనియర్ స్టార్‌తో జోడీ కట్టబోతున్న ఈ ముద్దుగుమ్మ రాబోయే రోజుల్లో టాలీవుడ్ సీనియర్ హీరోలతో ఎలాంటి క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేస్తుందో? కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటుందో? చూడాలి.

Tags:    

Similar News