'ఓజీ 2'.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..

పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజీ' యూనివర్స్‌కు సంబంధించి రీసెంట్‌గా వరుస అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

Update: 2026-06-25 08:54 GMT

పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజీ' యూనివర్స్‌కు సంబంధించి రీసెంట్‌గా వరుస అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచైజీలో రాబోతున్న 'ఓజీ 2' మీద మేకర్స్ ఒక సాలిడ్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో డైరెక్టర్ సుజిత్, పవన్ కళ్యాణ్ కలిసి స్క్రిప్ట్ బుక్ పట్టుకుని కథా చర్చలు జరుపుతున్న తీరు చూస్తుంటే ప్లాన్ గట్టిగానే ఉండనున్నట్లు అర్ధమవుతుంది.

తొలి భాగాన్ని దానయ్య నిర్మించగా, రెండో భాగాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పై భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఈ బ్యానర్ అఫీషియల్ గా పూర్తి యాక్టివ్ మోడ్‌లోకి వచ్చి, ప్రొడక్షన్ పనులను సీరియస్‌గా ముందుకు తీసుకెళ్తోంది. ఈ లేటెస్ట్ వీడియోలో సుజిత్ ఓజీ కథను నరేట్ చేస్తున్న విధానం హైలైట్‌గా నిలిచింది.

ఓపెనింగ్ షాట్‌లోనే మంచు మొత్తం రక్తంతో ఎర్రగా మారిపోతుందని, అప్పుడే 'ఓజస్ గంభీర' ఎంట్రీ ఉంటుందని సుజిత్ చెబుతున్న డైలాగ్స్ సినిమా టోన్‌ను సెట్ చేశాయి. కామిక్ బుక్ స్టైల్ యానిమేషన్ ద్వారా చూపించిన జపనీస్ నింజా ఫైట్స్, చంద్రబోస్ ఆర్ట్ వర్క్, రెండో ప్రపంచ యుద్ధం నాటి ట్యాంకర్లు, రెడ్ డ్రాగన్ విజువల్స్ ఒక ఇంటర్నేషనల్ ఫీల్ ను తీసుకొచ్చాయి.

తుఫాను రాకముందు ఉండే నిశ్శబ్దం అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తే, ఓజీ 2 లో గంభీర గతాన్ని పూర్తిగా డీకోడ్ చేయబోతున్నారని అర్థమవుతోంది. అసలు ముంబై అండర్ వరల్డ్‌కు, జపాన్‌కు ఉన్న లింక్ ఏంటి? గంభీర గతంలో జరిగిన ఆ భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చుట్టూ ఈ రెండో భాగం బలంగా సాగనుందని డైరెక్టర్ సుజిత్ హింట్ ఇచ్చాడు.

ఒక స్టార్ హీరో ఇమేజ్‌తో పాటు గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్న ఒక యాక్షన్ యూనివర్స్‌ను క్రియేట్ చేసే గోల్డెన్ ఛాన్స్ సుజిత్‌కు దక్కింది. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తుండటంతో, డైరెక్టర్ విజన్‌కు ఎలాంటి లిమిట్స్ లేకుండా పోయాయి. ఈ ఓజీ 2 గనక బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడితే, పవన్ ఇక ఈ కుర్ర డైరెక్టర్‌తోనే ఆ సినిమాటిక్ ప్రపంచాన్ని తన సొంత ప్రొడక్షన్‌లో మరింత పెద్దదిగా మార్చే ఛాన్స్ ఉంది. ఇక ఓజీ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ అప్డేట్స్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. హీరోగానే కాకుండా, తన క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ద్వారా పవన్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతలా ఓన్ చేసుకున్నారో ఈ డిస్కషన్స్ చూస్తేనే తెలుస్తోంది. థియేటర్లలో ఈ ఫైర్ స్టామ్ మొదలైతే బాక్సాఫీస్ లెక్కలు ఏ రేంజ్‌లో మారుతాయో చూడాలి.




Tags:    

Similar News