రాశీఖన్నా లేటెస్ట్ లుక్ వైరల్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిందిగా!
రాశీ ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్ర కారు హృదయాలను దోచుకుంది.
రాశీ ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్ర కారు హృదయాలను దోచుకుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకున్న రాశి ఖన్నా ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మరో హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాతో నైనా మంచి సక్సెస్ అందుకోవాలని ఎన్నో కలలు కంది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈమెకు సక్సెస్ లభించలేదు. అయితే అవకాశాలు మాత్రం మెండుగా వస్తూ ఉండడం గమనార్హం.
తాజాగా కమలహాసన్ నిర్మాణంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీలో అవకాశాన్ని దక్కించుకొని అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య దశాబ్దాల తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై గత కొన్ని నెలలుగా అంచనాలు పీక్స్ కి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేస్తూ గ్రాండ్గా టైటిల్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ధర్మన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టైటిల్ తో పాటు రజనీకాంత్ ఫస్ట్ లుక్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్లో రాశీ ఖన్నా తన గ్లామర్ లుక్కుతో అందరిని ఆకట్టుకుంది.రా మ్యాంగో వారి హాఫ్ వైట్ ఐవరి పట్టు చీర అంచున బంగారు జరీతో డిజైన్ చేసిన చీరను ధరించింది. సాంప్రదాయ పద్ధతిలో చేతితో నేసిన ఈ చీరకి కాంబినేషన్లో ఇండిగో కలర్ సిల్క్ బ్లౌజ్ ధరించి తన లుక్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది.ఈ చీరకు తగ్గట్టుగా సాంప్రదాయ హస్త కళతో డిజైన్ చేసిన వెడల్పాటి బంగారు చౌకర్ ను ధరించి తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. ఇక అలా రాశిఖన్నా టైటిల్ లాంచ్ ఈవెంట్లో కట్టుకున్న చీరకు సంబంధించిన ఫోటోలను ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకోవడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.
రాశీ ఖన్నా విషయానికి వస్తే.. ఈ చిత్రంతో పాటు అనీస్ బజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే ఆర్ మాధవన్ తో ఒక సినిమాలో నటిస్తున్న ఈమె.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికైతే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.