ఫ్లేర్ లాంగ్ ఫ్రాక్ లో రకుల్ గ్లామర్ షో!
సినిమాలలో అవకాశాలు లభించినా.. లభించకపోయినా.. ఇతర వ్యాపారాల ద్వారా బిజీగా ఉన్నా.. లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ అటు నెటిజన్స్ ఇటు ఫాలోవర్స్ ను మెప్పించడానికి సెలబ్రిటీలు ఎప్పుడూ ముందే ఉంటారు.
సినిమాలలో అవకాశాలు లభించినా.. లభించకపోయినా.. ఇతర వ్యాపారాల ద్వారా బిజీగా ఉన్నా.. లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ అటు నెటిజన్స్ ఇటు ఫాలోవర్స్ ను మెప్పించడానికి సెలబ్రిటీలు ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే ఒకవైపు సాంప్రదాయంగా.. మరొకసారి గ్లామర్ షో చేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. అలా నిత్యం ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడిన ఈ సెలబ్రిటీలు రోజుకొక ట్రెండీ అవుట్ ఫిట్ తో అటు ఫ్యాషన్ ప్రియులను కూడా మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు.
ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అటు గ్లామర్ షో ఇటు జిమ్ వర్కౌట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువలో ఉండే రకుల్ తాజాగా మరో ఔట్ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిత్యం ఈమెను ఫాలో అయ్యే ఫ్యాషన్ ప్రియులకు ఇదో సరికొత్త ట్రెండీ ఔట్ ఫిట్ అని చెప్పవచ్చు. షోల్డర్ లెస్ ఫ్లేర్ లాంగ్ ఫ్రాక్ ధరించి తన గ్లామర్ లుక్ తో ఆకట్టుకుంది. ఒకవైపు సెల్ఫీ ఫోజులతో ముచ్చటేసిన ఈ ముద్దుగుమ్మ.. అటు ఎర్రటి పెదాలకు లిప్స్టిక్ వేస్తూ మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫ్యాషన్ అవుట్ ఫిట్ ఫోటోలు సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ కెరటం అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో ప్రార్థన అనే పాత్రతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసుకుంది. ఇందులో ప్రార్థన ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ అనే డైలాగ్ తో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది . ఈ సినిమా ఇచ్చిన విజయంతో రామ్ చరణ్, అల్లు అర్జున్ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ మరింత బిజీగా మారిపోయింది. దాదాపు 5 సంవత్సరాల పాటు టాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలిన ఈ ముద్దుగుమ్మ చివరిగా కొండ పొలం సినిమాలో నటించి తెలుగు తెరకు దూరమైంది.
బాలీవుడ్ ప్రముఖ నటుడు , నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసి అక్కడే సెటిల్ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. దేదే ప్యార్ దే 2 చిత్రంలో నటించిన ఈమె ప్రస్తుతం తమిళ్లో ఇండియన్ 3 సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలకు సైన్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ .
ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి అయిన విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి అయింది అంటే తమ ఫేవరెట్ సెలబ్రిటీలు ఎప్పుడు తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతారనే విషయాలపై అభిమానులు కుతూహలం కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రెగ్నెన్సీ శుభవార్త చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ శుభవార్త చెప్పే తరుణం ఎప్పుడు వస్తుందో చూడాలి అంటూ నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.