థియేటర్లకి గ్రీన్ సిగ్నల్ వచ్చినా సినిమాల విడుదల ప్రకటన లేదే...!
టాలీవుడ్ లో షూటింగుల సందడి తిరిగి ప్రారంభమైంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మూడు నెలల ముందే సినిమా షూటింగ్ లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒకరిద్దరు మినహా స్టార్ హీరోలెవరూ సెట్స్ పైకి వెళ్లే ధైర్యం చేయలేదు. అయితే ఇటీవల కాలంలో కేసుల సంఖ్య తగ్గుతుండటం.. రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉండటంతో ఒక్కొక్కరుగా సెట్స్ లో అడుగుపెడుతున్నారు. ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్న సినిమాలు ఆల్రెడీ కంప్లీట్ చేసేవారు. ఇక అక్టోబర్ 15 నుంచి సీటింగ్ కెపాసిటీ సగానికి తగ్గించి సినిమా థియేటర్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతినిచ్చింది. దీంతో మరికొన్ని రోజుల్లో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారు. అయితే ముందుగా సినిమాను రిలీజ్ చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపుతారన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోమని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఫిలిం మేకర్స్ అందరూ స్లాట్స్ కోసం పడతారని అందరూ అనుకున్నారు. అయితే థియేటర్స్ తెరుస్తామని క్లారిటీ వచ్చినా పలానా సినిమా మీ అభిమాన థియేటర్స్ లో విడుదల కాబోతోందంటూ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. పోనీ సినిమాలు రెడీగా లేవా అనుకోడానికి లాక్ డౌన్ కి ముందే చాలా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని ఉన్నాయి. మరికొన్ని ఈ మధ్య చిత్రీకరణ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటున్నాయి. దీనిని బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ కి వస్తారా అనే సందేహం కూడా ఉంది. అందుకే థియేటర్స్ ఓపెన్ చేయడానికి సిద్ధపడినా మరో నెల రోజుల పాటు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.