పుష్ప గురించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

Update: 2020-04-22 05:50 GMT
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబినేషన్‌ లో రూపొందబోతున్న ‘పుష్ప’ చిత్రం గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రముఖ స్టార్స్‌ ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ నటుడిని విలన్‌ పాత్రకు ఎంపిక చేసేందుకు సుకుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు ఇటీవలే వచ్చాయి. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం కన్నడ నటుడు ధనంజయను సంప్రదించారనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం నివేధా థామస్‌ ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప చిత్రంలో ఒక లేడీ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంటుందని.. ఆ పాత్రకు గాను నివేదా థామస్‌ ను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. ట్యాలెంటెడ్‌ నటిగా గుర్తింపు దక్కించుకున్న నివేదా థామస్‌ ఖచ్చితంగా పుష్ప చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. నివేధా థామస్‌ కనిపించేది కొద్ది సమయమే అయినా కూడా కథలో కీలకంగా ఉంటుందని అంటున్నారు.

తెలుగులో నిన్ను కోరి చిత్రంతో పాటు పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును దక్కించుకుంది. కమర్షియల్‌ హీరోయిన్‌ గా బ్రేక్‌ దక్కకున్నా మంచి నటి అనే పేరును మాత్రం సంపాదించుకున్న నివేదా థామస్‌ ను సుకుమార్‌ తాజాగా సంప్రదించాడనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే బన్నీకి జోడీగా రష్మిక మందన్నను హీరోయిన్‌ గా ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక నివేధా థామస్‌ పాత్ర గురించి క్లారిటీ రావాల్సి ఉంది. లాక్‌ డౌన్‌ పీరియడ్‌ పూర్తి అయిన వెంటనే షూటింగ్‌ ను కేరళలో దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేశాడు. బన్నీ ఇంకా రష్మికలు ఈ సినిమా కోసం చిత్తూరు యాసను నేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది.


Tags:    

Similar News