ఆ కష్టం గురించి నాకు తెలుసు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన కపుల్ ఫ్రెండీ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్ గా నటించారు. ఈ స్పెషల్ చిట్ చాట్ లో హీరోహీరోయిన్లతో పాటూ దర్శకనిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఈ చిట్‌చాట్‌లో సినిమా నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
డైరెక్టరే బాగా ఇబ్బంది పెట్టాడు
సంభాషణలో భాగంగా ప్రభాస్ నిర్మాత అజయ్ కుమార్‌ను ఉద్దేశించి, సినిమా షూటింగ్ సమయంలో అందరిలో ఎక్కువగా ఎవరు ఇబ్బంది పెట్టారు? అని సరదాగా ప్రశ్నించారు. దీనికి అజయ్ కుమార్ స్పందిస్తూ, మా డైరెక్టరే ఎక్కువ ఇబ్బంది పెట్టారని తెలిపారు. చెన్నైలో ఎలాంటి సెట్‌లు లేకుండా పూర్తిగా రియల్ లొకేషన్లలో షూటింగ్ నిర్వహించామని, అదే సమయంలో పర్మిషన్ సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.
రెండుసార్లు దొరికిపోయాం
చెన్నైలో ట్రాఫిక్ లేని టైమ్ లో షూటింగ్ చేసుకోవాలని పోలీసులు చెప్పినప్పటికీ, డైరెక్టర్ మాత్రం సీన్స్ రియలిస్టిక్ గా రావడానికి ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉండే సాయంత్రం టైమ్ లో షూటింగ్ ను పెట్టేవాడని వెల్లడించారు. ఈ క్రమంలో రెండు సార్లు పోలీసులకు దొరికిపోయిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయని, అలా దొరికినప్పుడు ఓ సారి = ప్రీ వెడ్డింగ్ షూట్ అని, మరోసారి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుందని చెప్పి తప్పించుకున్నామని, లక్కీగా అక్కడి పోలీసులు కూడా తమకు హెల్ప్ చేయడంతో పెద్ద పెద్ద సమస్యలేమీ రాలేదు కానీ ఏమవుతుందా అని టెన్షన్ మాత్రం బాగా ఉండిందని అజయ్ కుమార్ వివరించారు.
రియలిస్టిక్ గా ఉండాలనే కారణంతోనే..
సినిమాను పూర్తిగా సహజమైన వాతావరణంలో చిత్రీకరించడమే తమ టార్గెట్ అని, అందుకే ఎలాంటి సెట్స్ వేయకుండా అసలు లొకేషన్లనే ఎంపిక చేశామని చిత్రబృందం ఈ సందర్భంగా వెల్లడించింది. దాని వల్లే సినిమా సహజత్వంతో, నిజ జీవితానికి దగ్గరగా కనిపించిందని వారు అభిప్రాయపడ్డారు. ప్రభాస్ కూడా తాము బిల్లా మూవీ షూటింగ్ ను మలేషియాలో అలానే ఎలాంటి సెట్స్, లొకేషన్స్ లేకుండా రియలిస్టిక్ గా చేశామని, ఆ కష్టమెలా ఉంటుందో తనకు తెలుసని, అలా చేయడం చాలా కష్టమైనప్పటికీ తర్వాత అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పారు.
చెన్నైతో స్పెషల్ బాండింగ్ ఉంది.
చెన్నైతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చెన్నై తో తనకు స్పెషల్ బాండింగ్ ఉందని, తాను అక్కడే పెరిగానని, తన స్కూలింగ్ కూడా అక్కడే అయిందని, అక్కడి ఎంతోమంది టెక్నీషియన్లతో కలిసి వర్క్ చేసిన ఎక్స్‌పీరియెన్స్ కూడా ఉందని చెప్తూ తమిళంలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు ప్రభాస్. మొత్తానికి, కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌తో జరిగిన ఈ చిట్‌చాట్ సరదా క్షణాలతో పాటు సినిమా నిర్మాణంలో ఎదురైన సవాళ్లను కూడా వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రభాస్ అందులో పాల్గొనడంతో ఈ సంభాషణకు మరింత ప్రత్యేకత చేకూరింది.