పూరీ లాంటి వాడు ప్రపంచంలోనే ఇంకొక‌రు లేరు

టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజాగా డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;

Update: 2026-02-20 09:38 GMT

టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజాగా డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా యూవీ కాన్సెప్ట్ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన క‌పుల్ ఫ్రెండ్లీ మూవీ టీమ్ తో ప్ర‌భాస్ ముచ్చ‌టించ‌గా, ఆ ఇంట‌ర్వ్యూలో హీరో సంతోష్ శోభ‌న్ త‌న‌కు ప్ర‌భాస్ న‌టించిన ఏక్ నిరంజ‌న్ మూవీ అంటే ఎంతో పిచ్చి అని చెప్పారు. అంద‌రికీ బుజ్జిగాడు సినిమా అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్తుంటారు కానీ త‌న‌కు మాత్రం ఏక్ నిరంజ‌న్ మూవీ అన్నా, ఆ మూవీలోని క్యారెక్ట‌రైజేష‌న్స్ అన్నా, మీ స్టైలింగ్ అన్నా ఎంతో ఇష్ట‌మ‌ని, మిమ్మ‌ల్ని క‌లిసిన‌ప్పుడు ఈ మాట చెప్పాల‌ని ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్నా అని ప్ర‌భాస్ తో చెప్పారు.

తెలియ‌కుండానే దాని గురించి మాట్లాడేవాడిని

ప్ర‌భాస్ కెరీర్‌లో స్పెష‌ల్ మూవీస్ గా నిలిచిన రెండు సినిమాలు బుజ్జిగాడు, ఏక్ నిరంజ‌న్ సినిమాల ప్ర‌స్తావ‌నలో భాగంగా ప్ర‌భాస్ పూరీ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. పూరీ జగన్నాథ్ లాంటి మనిషి రాష్ట్రంలో, దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఉండ‌రు అంటూ ఆయనపై ఉన్న గౌరవాన్ని వెల్ల‌డించారు. ఆయ‌న‌ రాసే డిఫరెంట్ క్యారెక్టర్లు తనను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రభాస్ ఈ సంద‌ర్భంగా వివరించారు. ముఖ్యంగా బుజ్జిగాడు సినిమా కథ వినగానే త‌న‌కు ఆ క్యారెక్ట‌రైజేష‌న్ విప‌రీతంగా న‌చ్చింద‌ని, ఆ టైమ్‌లో తాను ఎవ‌రితో మాట్లాడుతున్నా తెలియ‌కుండా బుజ్జిగాడు క్యారెక్ట‌ర్ గురించే మాట్లాడేవాడినని గుర్తు చేసుకున్నారు ప్ర‌భాస్.

ఏక్ నిరంజ‌న్ లో ఆ డైలాగ్ అంటే ఇష్టం

పూరీ రాసే క్యారెక్ట‌ర్లను ఎవ‌రూ ఇమిటేట్ చేయ‌లేర‌ని, వాటిలో ఓ స్పెష‌ల్ యాటిట్యూడ్, ఎనర్జీ, మాస్ అప్పీల్ ఉంటాయ‌న్నారు ప్ర‌భాస్. ఏక్ నిరంజ‌న్ సినిమా అంటే కూడా త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని, ఆ సినిమాలో ఉండే డైలాగ్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయ‌ని, అబ్బాయిలు కూడా ఏడుస్తారా అనే డైలాగ్ అంటే త‌న‌కు బాగా ఇష్ట‌మ‌ని, ఆ మూవీలో విల‌న్ క్యారెక్ట‌ర్ కు కూడా పూరీ ఎంతో మంచి డైలాగ్స్ ను రాశార‌ని, త‌ర్వాత ఆ డైలాగ్స్ బాలీవుడ్ లో వ‌చ్చిన ద‌బాంగ్ మూవీలో కూడా వాడుకున్నార‌ని, సోనూ సూద్ పూరీకి కాల్ చేసి ఆ డైలాగ్స్ వాడుకోవ‌చ్చా అని అడిగితే పూరీ అందులో ఏముంది వాడుకోమ‌న్నాడ‌ని, అత‌ను రాసే డైలాగ్స్ కు అంత‌టి క్రేజ్ ఉంద‌ని ప్ర‌భాస్ పేర్కొన్నారు.

పూరీ విష‌యంలో ప్ర‌భాస్ చెప్పింది ముమ్మాటికీ వాస్త‌వ‌మే. పూరీ కాస్త ఫోక‌స్ చేసి క‌థ‌ను రాసుకోవాలే కానీ ఆ మూవీతో పూరీ ఎంతో మ్యాజ‌క్ చేయ‌గ‌ల‌రు. అంత‌టి టాలెంట్ పూరీ సొంతం. ఇప్పుడంటే పూరీ కెరీర్ లో కాస్త వెనుకంజ‌లో ఉన్నారు కానీ ఒక‌ప్పుడు ఆయ‌న తీసే సినిమాలు, ఆ సినిమాల‌కు ఉండే క్రేజ్, ఫాలోయంగ్ పూర్తిగా వేరు. అందుకే బుజ్జిగాడు, ఏక్ నిరంజ‌న్ సినిమాల‌కు స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పూరీ గురించి అంత గొప్ప‌గా చెప్తున్న ప్ర‌భాస్ ఫ్యూచ‌ర్ లో మ‌రోసారి అత‌నితో క‌లిసి వ‌ర్క్ చేసే అవ‌కాశముంటుందేమో చూడాలి.




Tags:    

Similar News