ప్రొడ్యూసర్ బన్నీ వాస్.. నెక్స్ట్ టార్గెట్ లాయర్ కోట్!

మెుదట్లో సినిమాల డిస్ట్రిబ్యూషన్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని, ఆ తర్వాత ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టారు. మెుదటి నుండి అల్లు అర్జున్‌కు బెస్ట్ ఫ్రెండ్ కావడమే కాకుండా, అల్లు అరవింద్‌కు నమ్మకస్థుడైన పార్ట్‌నర్‌గా నిలబడ్డారు.;

Update: 2026-02-20 11:15 GMT

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నాడు బన్నీ వాస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి మెుదలైన ప్రస్థానం నేడు గీతా ఆర్ట్స్ 2 లాంటి టాప్ బ్యానర్‌ను లీడ్ చేసే వరకు సాగింది. మెుదట్లో సినిమాల డిస్ట్రిబ్యూషన్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని, ఆ తర్వాత ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టారు. మెుదటి నుండి అల్లు అర్జున్‌కు బెస్ట్ ఫ్రెండ్ కావడమే కాకుండా, అల్లు అరవింద్‌కు నమ్మకస్థుడైన పార్ట్‌నర్‌గా నిలబడ్డారు.

నిర్మాతగా మెుదటి సినిమా '100% లవ్' తోనే మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, ప్రతి రోజు పండగే వంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చూపించారు. కేవలం పెద్ద సినిమాలే కాకుండా, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఎంతోమంది కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇటీవల 'BV వర్క్స్' పేరుతో కొత్త బ్యానర్ స్టార్ట్ చేసి తన స్నేహితులకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం మరికొన్ని భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టడానికి సిద్దమవుతున్నారు. ఇక సినిమాలతో బిజీగా ఉన్నా, LLB పూర్తి చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా పనులు, షూటింగులతో తీరిక లేకుండా గడుపుతున్నా, తన ఎడ్యుకేషన్ లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.

ఈ ఎల్‌ఎల్‌బి పరీక్షలు రాసిన విషయం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ మరో నెల రోజుల్లో రాబోతున్నాయి. సినిమా మేకింగ్ లో బన్నీ వాస్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పక్కా ప్లానింగ్‌తో తక్కువ టైమ్‌లో క్వాలిటీ అవుట్‌పుట్ తీసుకురావడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్నారు. సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ పొలిటికల్ క్యాంపైన్ పనులను కూడా చక్కగా హ్యాండిల్ చేసి తన మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ని చాటుకున్నారు.

వచ్చే నెలలో రాబోయే రిజల్ట్స్ మీద బన్నీ వాస్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రొడ్యూసర్‌గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న ఈయన, ఇప్పుడు లాయర్ కోటు వేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. అటు ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే, ఇటు చదువును బ్యాలెన్స్ చేయడం చూస్తుంటే తన వర్క్ స్టైల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు సినిమాలు, మరోవైపు తన ఎడ్యుకేషన్ పనులను సమాంతరంగా నడిపిస్తున్నారు. నెల రోజుల్లో రాబోయే ఎల్‌ఎల్‌బి రిజల్ట్స్ తర్వాత బన్నీ వాస్ తన నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో రివీల్ చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News