కపుల్ ఫ్రెండ్లీని మరో నాలుగు సార్లు చూడ్డానికి రెడీగా ఉన్నా!
ఈ సందర్భంగా ప్రభాస్ చిత్ర యూనిట్ తో ఒక చిట్ చాట్ ను నిర్వహించారు. 37 నిమిషాల పాటు సాగిన ఈ ప్రత్యేక సంభాషణలో ప్రభాస్ కపుల్ ఫ్రెండ్లీ మూవీలోని అనేక అంశాలను ప్రస్తావించారు.;
రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా రొమాంటిక్ డ్రామా కపుల్ ఫ్రెండ్లీ మూవీపై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాను హృదయపూర్వకంగా అభినందిస్తూ, కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఎమోషన్స్ తో నిండిన బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ అని ప్రభాస్ ప్రశంసించారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
ఆ మెసేజ్ మనసులో ఉండిపోతుంది
ఈ సందర్భంగా ప్రభాస్ చిత్ర యూనిట్ తో ఒక చిట్ చాట్ ను నిర్వహించారు. 37 నిమిషాల పాటు సాగిన ఈ ప్రత్యేక సంభాషణలో ప్రభాస్ కపుల్ ఫ్రెండ్లీ మూవీలోని అనేక అంశాలను ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ తననెంతో కదిలించిందని చెప్పారు. జీవితమంతా సడెన్ గుడ్‌బైస్ చెప్పడమేనని, అందుకే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే మెసేజ్ సినిమా అయిపోయాక కూడా మనసులో మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.
హీరో సంతోష్ శోభన్ యాక్టింగ్ పై ప్రభాస్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.
సంతోష్ మెచ్యూర్డ్ గా చేశాడు
ముఖ్యంగా హాస్పిటల్ సీన్ లో అతని భావోద్వేగ విరహం ఎంతో సహజంగా, మెచ్యూర్డ్ గా అనిపించిందన్నారు. అతని యాక్టింగ్ లో చాలా ఎక్స్‌పీరియెన్డ్స్ యాక్టర్ కనిపించాడని పేర్కొన్నారు. ఈ సినిమాను మరో మూడు నాలుగు సార్లు చూడటానికి కూడా తాను రెడీగా ఉన్నానని ప్రభాస్ చెప్పారు. హీరోయిన్ మానస వారణాసి తన సెన్సిటివ్ యాక్టింగ్ తో మెప్పించిందని, ఆమె చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ కథను మరింత సహజంగా మలిచాయని అన్నారు.
ఇంటర్వెల్ బ్లాక్‌లో సంతోష్ క్యారెక్టర్ ను తనతో పాటూ అందరూ హేట్ చేస్తారని, ఆ క్యారెక్టర్ ను చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేసినప్పుడే అలా ఫీలవడం జరుగుతుందని ప్రభాస్ వివరించారు. అలాగే, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఫోన్ ఫోన్ సంభాషణ కూడా తనకెంతో నచ్చిందని ప్రభాస్ చెప్పారు. ఆ సీన్ రొమాన్స్‌ను మరింత మధురంగా, మ్యాజిక్ లా మార్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ ఈ కథను ఎంతో సెన్సిటివ్ గా, శక్తివంతమైన రచనతో, విజువల్స్ పరంగా ఆకట్టుకునేలా ఆవిష్కరించారని ప్రభాస్ ప్రశంసించారు. ఈ మూవీ ఎమోషన్స్ కు ప్రాధాన్యమిస్తూనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిందని ప్రభాస్ ఈ సందర్భంగా చెప్పారు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ వల్ల కపుల్ ఫ్రెండ్లీ టీమ్ కు మంచి బూస్టప్ దక్కినట్టైంది. మరి ప్రభాస్ ఎంట్రీతో ఈ సినిమా కలెక్షన్లు ఏమైనా పెరుగుతాయేమో చూడాలి.