ప్రభాస్ ఫేవరెట్ సినిమా.. 'కపుల్ ఫ్రెండ్లీ' చూశాక మళ్ళీ అదే ఫీల్!
సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా కోసం ప్రభాస్ రంగంలోకి దిగాడు.;
సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా కోసం ప్రభాస్ రంగంలోకి దిగాడు. మొదట సోషల్ మీడియాలో సపోర్ట్ అందించిన డార్లింగ్ ఈసారి డైరెక్ట్ గా ఇంటర్వ్యూలో సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేశాడు. ఇక సినిమా చూసిన తర్వాత ప్రభాస్ తన మనసులోని మాటను ఓపెన్‌గా పంచుకున్నారు. ఈ క్రమంలో తన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా గురించి కూడా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రభాస్ కి ఒక సినిమా అంటే ఎంత ఇష్టమో ఈ ఇంటర్వ్యూ ద్వారా మరోసారి బయటకు వచ్చింది.
ప్రభాస్ అంటే ఒక మాస్ హీరో, యాక్షన్ స్టార్ అని అందరూ అంటుంటారు. కానీ ఆయనకు ప్యూర్ లవ్ స్టోరీలంటే చాలా ఇష్టమని చాలామందికి తెలియదు. తన ఫేవరెట్ సినిమా ఏదని ఎవరైనా డైరెక్టర్లు అడిగితే తడుముకోకుండా గీతాంజలి అని చెబుతుంటానని ప్రభాస్ అన్నారు. మణిరత్నం గారికి ఆయన ఎంత పెద్ద ఫ్యానో ఈ మాటలను బట్టి అర్థమవుతోంది. ఆ సినిమాలోని మేకింగ్, ఎమోషన్స్ ఆయనను అంతలా ప్రభావితం చేశాయట.
ఇప్పుడు లేటెస్ట్‌గా రిలీజ్ అయిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా చూసినప్పుడు తనకు మళ్ళీ అదే గీతాంజలి ఫీల్ కలిగిందని ప్రభాస్ ప్రశంసించారు. సినిమా చూస్తున్నంత సేపు ఒక మంచి ప్రేమకథను చూస్తున్నాననే ఫీలింగ్ కలిగిందట. సంతోష్ శోభన్, మానస వారణాసి మధ్య ఉండే కెమిస్ట్రీ, ఆ సీన్స్ నేటి తరం యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రభాస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడారు. చివరి 20 నిమిషాల ఎమోషన్ చూసినప్పుడు తనను తాను మరిచిపోయానని, ఆ ఫీల్ నుండి బయటకు రావడానికి తనకు చాలా టైమ్ పట్టిందని చెప్పారు. వెరీ వెల్ మేడ్ ఫిలిం అంటూ చిత్ర యూనిట్ ని అభినందించారు. క్లైమాక్స్ లో వచ్చే ఆ ఎమోషన్స్ సినిమాకు అసలైన బలం అని డార్లింగ్ మాటలను బట్టి తెలుస్తోంది.
ఈ సినిమాను ప్రభాస్ ఇప్పటికే మూడు నాలుగు సార్లు చూశారంటే ఆయనకు ఈ కథ ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ మీద నమ్మకంతో ఒక మంచి ఎమోషనల్ డ్రామాని తీసినందుకు డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ ని ఆయన అభినందించారు. ఏదైనా ఒక మంచి విషయాన్ని మిస్ అవుతున్నారనే ఫీలింగ్ కలగకూడదంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని ప్రభాస్ రిక్వెస్ట్ చేశారు.
చిన్న సినిమా అని చూడకుండా, కంటెంట్ ఉంటే మద్దతు ఇచ్చే ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమాకు అండగా నిలవడం గొప్ప విషయం. డార్లింగ్ చెప్పినట్లుగా ఆ 20 నిమిషాల ఎమోషనల్ జర్నీ ప్రతి ప్రేక్షకుడిని కదిలిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ప్రభాస్ ఇచ్చిన ఈ బూస్ట్ తో ఇప్పుడు థియేటర్ల దగ్గర 'కపుల్ ఫ్రెండ్లీ' గట్టిగానే సందడి చేసేలా కనిపిస్తోంది. ఇక ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.