బన్నీ చెల్లెలిగా నితిన్ హీరోయిన్..?

Update: 2021-02-18 12:05 GMT

అల్లు అర్జున్‌ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' అనే యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా పతాకాలపై 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా నటించనుందని టాక్ నడుస్తోంది.

ఇందులో కీలకమైన పుష్ప రాజ్ చెల్లెలి పాత్రలో మేఘా ఆకాష్ ని తీసుకున్నారట. మేఘా తెలుగులో నితిన్ సరసన 'లై' 'చల్ మోహన రంగ' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం 'డియర్ మేఘ' అనే సినిమాలో నటిస్తున్న మేఘా.. 'పుష్ప'లో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

కాగా, పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి - రంపచోడవరం అటవీ ప్రాంతంలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కేరళ అడవుల్లో ప్లాన్ చేశారని సమాచారం.




Tags:    

Similar News