• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: నితిన్...

ఫోటో స్టోరి: నితిన్ బాబు.. పవన్ కోసమా?

By - Tupaki Desk
Update: 2016-12-12 13:59 GMT
పవన్ కళ్యాణ్ సినిమాలో నితిన్.. అంటే పవర్ స్టార్ మూవీలో ఈ యంగ్ హీరో కనిపించేస్తున్నాడా? లాంటి అనుమానాలు సహజమే కానీ.. అసలు విషయం ఏంటంటే.. నితిన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకి పవన్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఇతర హీరోలతో సినిమాలను కూడా నిర్మించేందుకు పవన్ ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ఇంకా ఈ ప్రాజెక్టు ప్రారంభం కానేలేదు. మరి లుక్ విషయం ఎలా లీక్ అయిందనే డౌట్ వచ్చేయడం సహజం. తాజాగా అఖిల్ అక్కినేని-శ్రేయా భూపాల్ ల నిశ్చితార్ధానికి నితిన్ హాజరయ్యాడు. ఇక్కడికి బాగా పెరిగిపోయిన గెడ్డం లుక్ తో నితిన్ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇంత పొడుగ్గా పెద్ద గెడ్డం పెంచడంతో ఇది మేకోవర్ కోసమే అనే విషయం అర్ధమయిపోతోంది. అది కూడా పవన్ నిర్మిస్తున్న సినిమా కోసమే నితిన్ ఇలా గెడ్డం పెంచాడని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

పవన్ తో పాటు ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్.. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డిలు కూడా నిర్మాతలుగా వ్యవహరించబోతున్న ఈ సినిమాకు లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకుడు. ఇక్కడ ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ నితిన్ తన సినిమాల్లో గెడ్డం లుక్ తో కనిపించనే లేదు. కాసింత రఫ్ నెస్ కోసం కొంచెం గెడ్డంతో కనిపించడమే కానీ.. ఇలా పేద్ద గెడ్డంతో మేకోవర్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. పవన్ తో చేయనున్న సినిమాలో నితిన్ ఇలా సంథింగ్ స్పెషల్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది.
Tags:    
  • Nithin New Loo 
  • Pawan Kalyan 
  • Trivikram Movie 
  • Krishna Chaitanya 
  • Akhil Engagement 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS