నితిన్‌ మొదటి 'చెక్‌' ఎత్తుగడ రానుంది

Update: 2021-01-02 09:30 GMT
నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'చెక్‌' సినిమా ఫస్ట్‌ లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా నుండి కొత్త సంవత్సరం కానుకగా మరో పోస్టర్‌ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్‌ వీడియోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు అంటే జనవరి 3వ తారీకున ఉదయం 10 గంటలకు 'చెక్‌' నుండి మొదటి గ్లింప్స్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

నితిన్ ఈ సినిమాలో చాలా విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళి ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మరో హీరోయిన్‌ గా నటిస్తుంది. తెలుగులో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నటిస్తున్న మొదటి సినిమా అవ్వడంతో పాటు నితిన్‌ కొత్తగా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. షూటింగ్‌ అప్ డేట్‌ మరియు విడుదల తేదీపై రేపు అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News