రాజమౌళి లేని ప్రభాస్.. బాక్సాఫీస్ దగ్గర ఆ ‘కన్సిస్టెన్సీ’ ఏది?

ఒక స్టార్ హీరో మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక పెద్ద హిట్ పడితే రికార్డులు మారుతాయి, అదే వరుసగా రెండు ఫ్లాపులు పడితే ట్రేడ్ లెక్కలు తారుమారవుతాయి.;

Update: 2026-04-28 18:30 GMT

ఒక స్టార్ హీరో మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక పెద్ద హిట్ పడితే రికార్డులు మారుతాయి, అదే వరుసగా రెండు ఫ్లాపులు పడితే ట్రేడ్ లెక్కలు తారుమారవుతాయి. ప్రభాస్ విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. ‘బాహుబలి’ తర్వాత ఆయన స్థాయి గ్లోబల్ రేంజ్‌కు వెళ్లినా, ఆ మార్కెట్ లెవెల్ ని స్థిరంగా కొనసాగించడంలో మాత్రం ఒడిదుడుకులు తప్పలేదు. ప్రస్తుతం లైనప్‌లో ఉన్న సినిమాలు ప్రభాస్ కెరీర్‌ను మళ్ళీ టాప్‌లో నిలబెడతాయా? లేక మార్కెట్ రీసెట్ అయ్యేలా చేస్తాయా? అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన ప్రయోగాలు కొన్ని గట్టిగానే దెబ్బ కొట్టాయి. ‘సాహో’ హిందీలో నిలబడగా ఆడినా సౌత్ ఆడియెన్స్ కి ఎక్కలేదు. ఇక రాధేశ్యామ్, ఆదిపురుష్ ఆశించిన రీతిలో ఆడలేదు. అయితే ప్రశాంత్ నీల్ ‘సలార్’, నాగ్ అశ్విన్ కల్కి 2898 AD మళ్ళీ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేశాయి. ముఖ్యంగా కల్కి రూ. 1100 కోట్లు వసూలు చేసి ప్రభాస్ పాన్ ఇండియా క్రౌడ్ పుల్లర్ అని చాటిచెప్పింది. కానీ ఈ ఏడాది జనవరిలో వచ్చిన ‘ది రాజా సాబ్’ భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలవడం ఫ్యాన్స్‌ను కొంత నిరాశకు గురిచేసింది.

అసలు పరీక్ష ఇక్కడే

ప్రభాస్‌కు రాజమౌళి తప్ప మరో దర్శకుడు 2000 కోట్లు రాబట్టే విజయాన్ని ఇవ్వగలరా? అనే సందేహం ఇప్పుడిప్పుడే మొదలైంది. ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ ఆ మార్కును టచ్ చేసినా, నిలకడ అనేది ముఖ్యం. ప్రస్తుతం ప్రభాస్ నమ్ముకున్న రెండు ప్రాజెక్టులే ఆయన భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయని అనిపిస్తుంది. ఒకటి హను రాఘవపూడి ‘ఫౌజీ’.. ఇది ఒక ఎమోషనల్ పీరియడ్ డ్రామా. రెండోది సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తేనే, ప్రభాస్ మళ్ళీ తన పాత ఫామ్ ను కొనసాగించగలరు.

పోటీలో మిగతా స్టార్లు

ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో మిగతా హీరోలు కూడా స్పీడ్ పెంచారు. అల్లు అర్జున్ పుష్ప 2తో హిందీ మార్కెట్‌లో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ కూడా దేవర తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాతో నార్త్ లో ఫోకస్ పెంచుతున్నాడు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నిరాశ పరిచినా, ఇప్పుడు బుచ్చిబాబు ‘పెద్ది’ చిత్రంతో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ పోటీలో ప్రభాస్ తన స్థానాన్ని మళ్ళీ టాప్ లోకి తెచ్చుకోవాలి అంటే ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ ఫలితాలు చాలా కీలకం కానున్నాయి. ఇక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా మిగతా హీరోలు రేసులో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.

డైరెక్టర్ల విజన్

ప్రభాస్ ఓపెనింగ్స్ కు ఎప్పుడూ ఇబ్బంది లేదు, కానీ లాంగ్ రన్ ఉండాలంటే కంటెంట్ లో దమ్ముండాలి. ‘స్పిరిట్’ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండటంతో, సందీప్ వంగా మేకింగ్ స్టైల్ మీద భారీ హైప్ ఉంది. యానిమల్ తర్వాత సందీప్ ఇమేజ్ కూడా ఈ సినిమాకు ప్లస్ కానుంది. అటు హను రాఘవపూడి తన సున్నితమైన కథతో ఏమోషన్ ను బాగా హైలెట్ చేయగలడు. ఇక అతనే ప్రభాస్ ను కొత్తగా చూపిస్తారని ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు దర్శకులు ప్రభాస్ మార్కెట్ ను మళ్ళీ నిలబెడతారా? లేక రాజమౌళి మార్క్ కోసం మళ్ళీ ఎదురుచూడాల్సి వస్తుందా? అనేది కాలమే చెప్పాలి.

ప్రస్తుతానికి ప్రభాస్ మార్కెట్ హోల్డ్ లోనే ఉంది. ‘రాజా సాబ్’ లాంటి పరాజయం ఎదురైనా, ఆయన క్రేజ్ తగ్గలేదు. కానీ వరుసగా ఫెయిల్యూర్స్ వస్తే మాత్రం బడ్జెట్ రికవరీ విషయంలో బయ్యర్లు ఆలోచనలో పడతారు. హారర్ కామెడీ జానర్ వర్కవుట్ కాకపోయినా, మాస్ యాక్షన్ కంటెంట్ పడితే ప్రభాస్ రేంజ్ వేరేలా ఉంటుంది. రాబోయే రెండేళ్లు అనేవి ప్రభాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. స్టార్ హోదా అంటే కేవలం ఒక్క సినిమాతో వచ్చేది కాదు, వరుస హిట్లు ఇస్తూ మార్కెట్ ను కాపాడుకోవాలి.బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ఇంకా నంబర్ వన్ రేసులోనే ఉన్నారు. సలార్, కల్కి చూపించిన ఇంపాక్ట్ చిన్నదేమీ కాదు. ఇప్పుడు కావాల్సింది కేవలం ఒక పక్కా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాగా సందీప్ రెడ్డి వంగా కూడా ఆ లిస్ట్ లో చేరితే ప్రభాస్ మళ్ళీ బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడం పక్కా.

Tags:    

Similar News