• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్రమ సంబంధం పెట్టుకుని...

అక్రమ సంబంధం పెట్టుకుని శారీరకంగా హింసించాడు

By - Tupaki Desk
Update: 2022-03-04 02:30 GMT
గత సంవత్సరం టీవీ నటి నిషా రావల్ మరియు బాలీవుడ్ నటుడు కరణ్‌ మెహ్రా లు విడి పోయారు. ఆసమయంలో చాలా పెద్ద రచ్చ జరిగింది. బాలీవుడ్‌ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా వీరి విషయమై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కరణ్‌ మెహ్రా మరియు పాయల్‌ రోహత్గీ ల మద్య ప్రేమ వ్యవహారం కారణంగానే నిషా రావల్ అతడి నుండి విడిపోయినట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

తాజాగా మరోసారి ఆ విషయంపై నటి నిషా రావల్ స్పందించింది. కంగనా రనౌత్ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న లాక్‌ అప్‌ అనే రియాల్టీ టాక్ షో లో భాగంగా నిషా రావల్‌ పలు విషయాలను వెళ్లడించింది. ఈ షో లో గత ఏడాది తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి నిషా రావల్ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నిషా కన్నీటి పర్యంతం అయ్యింది. తాను అత్యంత దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది.

నిషా రావల్ మాట్లాడుతూ.. నేను పలు సందర్బాల్లో కరణ్‌ మరియు పాయల్‌ రోహత్గీ ఫోన్ లో మాట్లాడుకోవడం గమనించాను. ఇద్దరి మద్య అక్రమ సంబంధం విషయం నాకు అర్థం అయిన తర్వాత మానసికంగా శారీరకంగా కరణ్ హింసించడం మొదలు పెట్టాడు. పాయల్‌ తో అక్రమ సంబంధం గురించి ప్రశ్నించాననే ఉద్దేశ్యంతో తమ కుమారుడుని తీసుకుని కరణ్‌ ముంబై వెళ్లి పోయాడు. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

పాయల్‌ తో ప్రేమ విషయం గురించి అడిగిన ప్రతిసారి కూడా అతడు చాలా వైల్డ్‌ గా ప్రవర్తించేవాడు. నేను మరొకరి ప్రేమలో ఉన్నాను. కొన్నాళ్లుగా మేము సీక్రెట్‌ గా రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తున్నాం. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. అలాగే నిన్ను కూడా ఇష్టపడుతున్నాను. ఇద్దరి పై తనకు ప్రేమ ఉంది అన్నట్లుగా మాట్లాడేవాడు. అతడి మాటలు నాకు చాలా బాధను కలిగించేవి అంటూ నిషా రావల్‌ అన్నారు.

కరణ్‌ ను నమ్మి పెళ్లి చేసుకున్నాను. అతడితో పెళ్లికి సిద్దం అయిన సమయంలోనే కొందరు హెచ్చరించినా కూడా నమ్మకంతో ఆయన్ను పెళ్లి చేసుకున్నాను. కాని అతడి వల్ల నా జీవితం నాశనం అయ్యింది. అందుకే మళ్లీ మళ్లీ అతడిని నమ్మ కూడదు అనే ఉద్దేశ్యంతో మీడియా ముందుకు వచ్చాను.

ఆ సమయంలో చాలా మంది కెచప్‌ పెట్టుకుని కెమెరా ముందుకు వచ్చావని కూడా విమర్శించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అతడి నుండి విడి పోయిన తర్వాత తన జీవితం సాఫీగా సాగుతుందని చెప్పుకొచ్చింది. శారీరకంగా మానసికంగా అతడు చాలా హింసించడం వల్లే విడాకుల వరకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
Tags:    
  • Nisha Rawal 
  • Karan Mehra 
  • Bollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS