• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిఖిల్ ఇంకా ఎందుకీ...

నిఖిల్ ఇంకా ఎందుకీ డైల‌మా?

By - Tupaki Desk
Update: 2019-07-23 14:30 GMT
ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా?  కేశ‌వ చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్నాడు నిఖిల్. కిరాక్ పార్టీ ఫ్లాపైనా త‌న‌కు వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేదు. అయితే ఆ త‌ర్వాత `అర్జున్ సుర‌వ‌రం` రిలీజ్ డైల‌మా ఈ యంగ్ హీరోని చికాకు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో దూకుడు మీదున్న హీరోగా నిఖిల్ పేరు మార్మోగింది. ఇలాంటి టైమ్ లో ఇంత గ్యాప్ రావ‌డం అభిమానుల్ని తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తోంది. తొలుత టైటిల్ స‌మ‌స్య ఇబ్బందికి గురి చేసింది. ఆ తర్వాత టైటిల్ ని `అర్జున్ సుర‌వ‌రం`గా మార్చాక ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డుతూనే ఉంది. వాయిదా ప‌డిన ప్ర‌తిసారీ నిఖిల్ ఎమోష‌నల్ గానే స్పందించారు.

అయితే ప్ర‌భాస్ `సాహో` వాయిదా ప‌డ్డాక నిఖిల్ నుంచి ఏదైనా ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అభిమానులు వేచి చూశారు. సాహో వాయిదా అన‌గానే ఆగ‌స్టు 15 బ‌రిలో ఇద్ద‌రు ముగ్గురు రెడీ అయ్యారు. శ‌ర్వానంద్-ర‌ణ‌రంగం.. అడివి శేష్ -ఎవ‌రు సినిమాల రిలీజ్ ల‌ను క‌న్ఫామ్ చేశారు. ప‌లువురు ఇదే తేదీకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే నిఖిల్ వైపు నుంచి సౌండ్ వినిపించ‌ లేదు. సాహో రిలీజ్ ఆగ‌స్టు 30న ఉంటుంది కాబ‌ట్టి ఆ త‌ర్వాత అయినా `అర్జున్ సుర‌వ‌రం` రిలీజ్ ఉంటుందా? అంటూ అభిమానుల్లో ముచ్చ‌ట సాగుతోంది.

మ‌రోవైపు ఈ సినిమా గురించి ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగుతోంది. కొన్ని ఆర్థిక ప‌ర‌మైన చిక్కుల వ‌ల్ల రిలీజ్ కావ‌డం లేదని .. లేదు ఎడిటింగ్ పూర్త‌వ్వ‌లేద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. కొన్ని సీన్లు అద‌నంగా జ‌త చేయాల్సి రావ‌డంతోనే ఈ ఆల‌స్యం అంటూ ర‌క‌ర‌కాలుగా ఫిలింన‌గ‌ర్ లో ముచ్చ‌టించుకుంటున్నారు. కార‌ణం ఏదైనా నిఖిల్ లాంటి రైజింగ్ హీరోకి ఈ గ్యాప్ అంత మంచిది కాద‌న్న వాద‌న అభిమానుల్లో ఉంది. `అర్జున్ సుర‌వ‌రం` త‌ర్వాత ఎప్ప‌టికి కొత్త సినిమా ప్రారంభిస్తాడు? అన్న ముచ్చ‌టా సాగుతోంది.


Tags:    
  • Nikhil 
  • Arjun Suravaram Movie 
  • Telugu News 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS