• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముద్ర బలంగా ఉండాలి నిఖిల్

ముద్ర బలంగా ఉండాలి నిఖిల్

By - Tupaki Desk
Update: 2018-08-11 06:41 GMT
హడావుడి పడకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తన టేస్ట్ ను బట్టే  కథలను ఎంచుకుంటున్న నిఖిల్ స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చేసింది. హ్యాపీ డేస్ రేంజ్ లో ఆడుతుందని ఆశలు పెట్టుకున్న కిరాక్ పార్టీ నిరాశ పరచడం నిఖిల్ నే కాదు అభిమానులను సైతం హర్ట్ చేసింది. అందుకే కొత్త సినిమా విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్న నిఖిల్ మరోసారి రీమేక్ నే తీసుకున్నప్పటికీ థ్రిలర్ జానర్ లోకి వెళ్లడం ఆసక్తిని రేపుతోంది. టాగోర్ మధు నిర్మాతగా తమిళ సూపర్ హిట్ మూవీ కనితన్ ఆధారంగా రూపొందుతున్న ముద్ర షూటింగ్ దాదాపు ఫైనల్ స్టేజి కి వచ్చేసింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ తీసిన టీఎన్ సంతోష్ తెలుగుకు కూడా దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విడుదల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోని యూనిట్ దసరా లేదా దీపావళి సీజన్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టు సమాచారం.

నిజానికి నిఖిల్ ఎప్పుడు రొటీన్ కథలకు కట్టుబడలేదు. థ్రిల్లర్స్ గా చేసిన స్వామి రా రా కార్తికేయ మంచి పేరుగా తీసుకురాగా హారర్ టచ్ ఉన్న ఎక్కడికి పోతావు చిన్నవాడా దర్శకుడు ఆనంద్ కు భారీ ఆఫర్ వచ్చేలా చేసింది. కాకపోతే కామెడీగా ట్రై చేయాలని చూసిన శంకరాభరణం ఒక్కటే ఫలితం తేడాగా ఇచ్చింది. అది మొహమాటానికి ఒప్పుకున్నా అని నిఖిల్ తర్వాత చెప్పాడు అది వేరే సంగతి. నిఖిల్ ముద్ర మీద ట్రేడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఒకవైపు నిన్నా మొన్న వచ్చిన యూత్ హీరోలు వరస సక్సెస్ లతో దూసుకుపోతుండగా నిఖిల్ కాస్త స్లో గా ఉండటం చూసి వేగం పెంచమని కోరుతున్నారు అభిమానులు. అంతే మరి. ఎంత కథలకు ప్రాధాన్యం ఇచ్చినా వరస సినిమాలతో రెగ్యులర్ టచ్ లో ఉంటేనే ఒకటి కాకపోయినా మరొక సక్సెస్ తో ట్రాక్ లో ఉండొచ్చు. ముద్ర కోసం బాడీ పరంగా కూడా నిఖిల్ చాలా మేకోవర్ చేసుకున్నాడు. కండలు తిరిగిన దేహాన్ని సోషల్ మీడియా పిక్స్ లో లీలగా చూపిస్తున్న నిఖిల్ దీని తర్వాత మరో క్రేజీ దర్శకుడితో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అతనెవరు ఆ వివరాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
Tags:    
  • Nikhil 
  • Lavanya Tripathi 
  • Mudra Movie 
  • Mudra TElugu NEws 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS