పులి ఫ్లాప‌వ్వ‌డం నా దుర‌దృష్టం

Update: 2015-11-19 09:30 GMT
కొంద‌రు ఎన్ని గుడులు గోపురాలు తిరిగానా శ‌ని వ‌ద‌ల‌ద‌ని అంటారు! ఈవిడ‌గారు ఆటైపు బాప‌తే. ఎంత ప్ర‌య‌త్నించినా  ల‌క్ త‌న ఫేవ‌ర్ కాలేదు ఈ అమ్మ‌డికి. ఎన్నో అవ‌కాశాలొచ్చాయి. కానీ ఒక్క‌టి కూడా హిట్టు రాలేదు. దాంతో కెరీర్ ప‌రంగా ఎంతో విసిగి వేసారి పోయింది. అందుకే ఇంత‌కాలానికి త‌న త‌ప్పు ఒప్పుల్ని ఓపెన్‌ గానే మీటింగులు పెట్టి మ‌రీ చెబుతోంది. అస‌లింత‌కీ ఎవ‌రి గురించో ఈపాటికే అర్థ‌మై ఉంటుంది. అవును పులి ఫేం నికీషా ప‌టేల్ గురించే  ఇదంతా.

లండన్‌ లో పుట్టి పెరిగిన ఈ ఇండియా బ్యూటీ విదేశాల నుంచి ఇండియాలో అడుగుపెట్టింది. ఇక్క‌డ వ‌స్తూనే బాలీవుడ్‌ లో అవ‌కాశాల కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. కానీ అక్క‌డ సినిమా అంత వీజీ కాదని అమ్మ‌డికి ప్రాక్టిక‌ల్‌ గా అర్థ‌మైంది. దాంతో ప్లాన్ మార్చుకుని టాలీవుడ్‌ లో అడుగుపెట్టింది. ఇక్క‌డికి వ‌స్తూనే క్రేజీగా ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. అయితే మొద‌టి సినిమానే అట్ట‌ర్‌ ఫ్లాప్ అవ్వ‌డంతో అదృష్టం కాస్తా దుర‌దృష్టంగా మారిపోయింది. ఆ క్ర‌మంలో అస‌లు త‌న జీవితంలో ఏం జ‌రిగింది? అన్న‌ది నికీషా చెబుతూ..

''తెలుగులో పులి ఫ్లాప‌వ్వ‌డం నా దుర‌దృష్టం. ఆ ప‌రాజ‌యం వ‌ల్ల ఏడాది పాటు సినిమాల్లేకుండా ఖాళీగా ఉండిపోవాల్సొచ్చింది. అంతేకాదు పులి చిత్రంలో న‌టిస్తున్న‌ప్పుడు కోలీవుడ్ నుంచి బోలెడ‌న్ని ఆఫ‌ర్లు. శింబు - ధ‌నుష్ లాంటి స్టార్లు పిలిచి అవ‌కాశాలిస్తామ‌న్నారు. అయితే నేను భారీ పారితోషికం అడ‌గ‌డంతో వాళ్లు కూడా సైడైపోయారు. ఇవ‌న్నీ కెరీర్ ఆరంభం నేను చేసిన త‌ప్పులే..'' అంటూ చెప్పుకుంది.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు న‌టించిన ఓ త్రిభాషా చిత్రం రిలీజ్‌ కి వ‌స్తోంది. తెలుగులో ఈ సినిమా లీలా పేరుతో వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ లో భాగంగానే కెరీర్ గురించి ఇంత సుదీర్ఘంగా ముచ్చ‌టించింద‌న్న‌మాట‌! అదీ సంగ‌తి.
Tags:    

Similar News