• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్ ... మహేశ్...

త్రివిక్రమ్ ... మహేశ్ మూవీలో నిధి అగర్వాల్?

By - Tupaki Desk
Update: 2021-05-24 23:30 GMT
అందం లక్షణమే ఆకర్షించడం .. అలాంటి అందం అలుముకున్న అమ్మాయిలే హీరోయిన్లు. ఈ మధ్య కాలంలో తెరపై చూడగానే పిల్ల చందమామలా ఉందనిపించిన హీరోయిన్ నిధి అగర్వాల్. బ్రహ్మదేవుడు మురిసిపోతూ చేసినట్టుగా ..        ముచ్చటపడి గీసినట్టుగా కనిపించే ఈ పిల్లను చూస్తే కలలు రానివారు ఎవరు? కలలు రావాలని పగటిపూట కూడా కునుకు తీయని వారెవరు? అంతగా ఈ అమ్మాయి తన సొగసులతో సెగలు పుట్టించింది .. వాళ్ల మనసు పాత్రల్లో మత్తుమందు దట్టించింది.

అలాంటి నిధి అగర్వాల్ కి తొలి రెండు సినిమాలు కూడా నిరాశనే కలిగించాయి .. చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అయితే అదృష్టం కొద్దీ మూడో సినిమా 'ఇస్మార్ట్ శంకర్'తో భారీ విజయాన్ని అందుకుంది. ఒకసారి పైకి లేచిన రాకెట్ నైనా ఆపొచ్చునేమోగానీ, అందానికి అదృష్టం తోడైతే మాత్రం ఆపడం కష్టమే. అదే ఈ సుందరి విషయంలోను జరిగింది ... నేరుగా పవన్ కల్యాణ్ సినిమాలో ఆయన సరసన నాయికగా ఛాన్స్ కొట్టేసింది. 'హరి హర వీరమల్లు'లో కథానాయకుడి మనసును కాజేసే పాత్రలో నటిస్తోంది.

ఆ తరువాత ఆమె త్రివిక్రమ్ సినిమాలోను కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉంటుందట. ఒక కథనాయికగా పూజా హెగ్డేను ఖాయం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరో కథానాయికగా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. ఆమెను సంప్రదించారట .. ఆమె కుదరదని చెబితే మాత్రం ఆ ఛాన్స్ నిధి అగర్వాల్ కి దక్కడం ఖాయమనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.  
Tags:    
  • Nidhi Agarwal 
  • Nidhi Agarwal Latest Images 
  • Nidhi Agarwal Photos 
  • Tollywood 
  • Telugu News 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS