బాలయ్యకు వారణాసి కష్టాలు?
నందమూరి బాలకృష్ణ సక్సెస్ కోసం పరితపిస్తున్నాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఆయన వరుసగా ఫ్లాప్స్ చవిచూస్తూ వస్తున్నాడు. నందమూరి అభిమానులు కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బోయపాటితో బాలయ్య జత కట్టడంతో ఫ్యాన్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో గతంలో సూపర్ హిట్స్ సింహా.. లెజెండ్ చిత్రాలు వచ్చాయి. కనుక మరో హిట్ ఖాయం అనుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబో మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. తదుపరి షెడ్యూల్ ను వారణాసిలో ప్లాన్ చేయాల్సి ఉంది. ఈలోపు లాక్ డౌన్ తో మొత్తం ఎక్కడికి అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది.
బాలకృష్ణ బోయపాటిల కాంబో మూవీ వారణాసి బ్యాక్ డ్రాప్ లో అనే విషయం తెల్సిందే. ఆ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా తెలియజేశారు. వారణాసిలో మెజార్టీ పార్ట్ చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని కరోనా కారణంగా లాక్ డౌన్ తర్వాత కూడా అక్కడ షూటింగ్ కు అనుమతించే అవకాశం కనిపించడం లేదు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ షూటింగ్ చేయాలంటే కనీసం మూడు నాలుగు నెలలు అయినా వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.
వారణాసిలో చిత్రీకరణ కోసం అప్పటి వరకు బోయపాటి వెయిట్ చేస్తాడా లేదంటే తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ ను పూర్తి చేస్తాడా అనేది చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ చేయాలంటే స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయాల్సి రావచ్చు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వగా ఇప్పుడు మళ్లీ మార్పులు అంటే అదో పెద్ద తలనొప్పి.
షూటింగ్ కోసం ఇప్పటికే వారణాసిలో అడ్వాన్స్ లు కూడా ఇచ్చారనే సమాచారం ఉంది. కనుక ఆ అడ్వాన్స్ లను వదులుకోవాల్సి వస్తుంది. కథలో వారణాసి కీలకం కనుక అక్కడ షూటింగ్ చేయకుంటే మొత్తం కథనే మార్చాల్సి రావచ్చు అనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. మొత్తానికి వారణాసి బ్యాక్ డ్రాప్ వల్ల బాలయ్య సినిమాకు కష్టాలు తప్పడం లేదు.