ఈ తరం సంగీత స్వరం మారిపోతోంది

Update: 2017-02-17 17:30 GMT
ఇప్పటి సినిమాలకు సంగీతం చాలా ప్రాణం. సినిమా రిలీజ్ కంటే ముందే.. ఆ మూవీ ఓ ఇంప్రెషన్ కలిగించేసే పవర్ ఫుల్ సాధనం మ్యూజిక్. కొన్ని సినిమాలయితే.. కేవలం మ్యూజిక్ అండతోనే రూపొందేలా కూడా ఉంటాయి. కానీ టాలీవుడ్ లో కొన్నేళ్లుగా దేవిశ్రీ ప్రసాద్.. ఎస్ఎస్ థమన్.. అనూప్ రూబెన్స్.. వీళ్ల హవా నడుస్తోంది. అడపాదడపా కొందరు ప్రయత్నించినా.. వీరి స్థాయిలో ఇంకెవరూ రాలేకపోయారు.

ఏఆర్ రెహమాన్.. హారిస్ జయరాజ్ లు మధ్యమధ్యలో కొన్ని సినిమాలు చేశారంతే. టాలీవుడ్ కూడా ఈ పరిస్థితిని గుర్తించింది. తెలుగు సినిమాకు కొత్త సంగీతాన్ని అందించాల్సిన అవసరాన్ని పసిగట్టారు మేకర్స్. రామ్ చరణ్ రీసెంట్ మూవీ ధృవతో హిప్ హాప్ తమిళ చేసిన మ్యాజిక్ అందరికీ తెగ నచ్చేసింది. వీరితో పాటు మరికొందరు కూడా త్వరలో టాలీవుడ్ కి కొత్తదనం అందించబోతున్నారు. వచ్చే నెలలో ప్రారంభం కాబోతోన్న  పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీతో.. కోలీవుడ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు.

బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న మూవీకోసం బాలీవుడ్ సంగీత దర్శకత్రయం శంకర్-ఎహసాన్-లాయ్ లను తీసుకొచ్చారు. రవితేజ మూవీ టచ్ చేసిన చూడు చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రీతమ్ ను.. బన్నీ-వక్కంతం వంశీల కాంబినేషన్ లో రూపొందనున్న 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' కోసం కూడా తీసునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి టాలీవుడ్ లో తరం మారుతున్నది.. సంగీత స్వరం మారుతతున్నది అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News