పాత హీరో కడుపున కొత్త వారసుడు ఈ హీరో

Update: 2021-08-27 01:30 GMT
ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు తీసిన కాలంలో హీరో హరినాథ్ అంటే తెలియని వారుండరు. అప్పట్లో సినిమాల్లో అంత క్రేజ్ సంపాదించుకున్న హీరో ఆయన.. ఇప్పటితరానికి  హరనాథ్ ఎవరో కూడా తెలియదు.. తక్కువ కాలంలోనే ఆయన మంచి సినిమాలు చేసి అనంతరం కనుమరుగైపోయాడు.

తాజాగా ఆ హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనవడు 'విరాట్ రాజ్' హీరోగా వారి కుటుంబం నుంచి ఎంట్రీ ఇస్తున్నాడు. వెంకటసుబ్బరాజు కూడా అప్పట్లో కొన్ని సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం విరాజ్ రాజ్ పరిచయం అవుతున్న చిత్రం పేరు 'సీతామనోహర శ్రీరాఘవ'.  ఈ చిత్రం ద్వారానే హరనాథ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

మీడియా, చిత్రపరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఈ అలనాటి హీరో వారసుడిని ఆశీర్వదించాలని ఈ కొత్త హీరో విరాజ్ రాజ్ కోరుతున్నాడు.

ఇక ''సీతామనోహర శ్రీరాఘవ' అనే సినిమా ద్వారా దుర్గా శ్రీవాత్సవ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. 'హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ మూవీకి నేను  దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. కేజీఎఫ్2, సలార్ చిత్రాలకు సంగీతం అందిస్తున్న 'రవి బసూర్' ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండడం విశేషంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News