మాస్ రాజా 'ఇరుముడి'.. ఊహించని ట్విస్ట్!
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి 'ఇరుముడి' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;
మాస్ మహారాజా రవితేజ తన 77వ సినిమా అనౌన్స్‌మెంట్‌తో అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. సాధారణంగా రవితేజ సినిమా అంటే ఎలా ఉండబోతోందో ముందే ఒక ఐడియా వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం మేకర్స్ ఎక్కడా లీక్స్ రాకుండా చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి 'ఇరుముడి' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోస్టర్‌లో రవితేజ నల్లని దుస్తుల్లో, అయ్యప్ప మాల ధరించి కనిపిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఎన్నడూ రవితేజను ఇలాంటి గెటప్‌లో చూడలేదు. టైటిల్ 'ఇరుముడి' అని పెట్టడం, దానికి తగ్గట్టుగానే రవితేజ మాల వేసుకుని ఉండటం, అలాగే తోటి స్వాములు ఆరాధనలో నిమగ్నమయ్యారు. ఫ్రేమ్ ని చూస్తుంటే.. కథలో అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించిన ఒక బలమైన నేపథ్యం ఉందని అర్థమవుతోంది.
ఇది రెగ్యులర్ సినిమా కాదని, ఏదో కొత్తగా ఉండబోతోందని పోస్టర్ చూస్తేనే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ పోస్టర్‌లో రవితేజ ఓ పాపను ఎత్తుకొని కనిపిస్తున్నారు. ఆ పాప ఎవరు? సినిమాలో రవితేజకు ఆ పాపకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అయ్యప్ప మాలలో ఉన్న రవితేజ ఆ పాపను ఎందుకు వెతుకుతున్నాడు లేదా కాపాడుతున్నాడు అనే కోణంలో కథ ఉండే అవకాశం ఉందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఎక్కడా కథ బయటపడకుండా మేకర్స్ ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచింది.
శివ నిర్వాణ అంటేనే ఎమోషన్స్‌ను పండించడంలో స్పెషలిస్ట్. అలాంటి దర్శకుడు రవితేజతో ఈ 'ఇరుముడి' కాన్సెప్ట్ ఎంచుకోవడం వెనుక ఏదో పెద్ద ప్లానే ఉందనిపిస్తోంది. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు, ఆ సమయంలో ఎదురయ్యే పరిస్థితుల చుట్టూ ఏదైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్ మిక్స్ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.
కేవలం ఒక పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పీక్స్‌కు తీసుకెళ్లడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా జరుగుతోంది. హీరోయిన్ ఎవరు, ఇతర నటీనటులు ఎవరు అనే విషయాలను మేకర్స్ ఇంకా అఫీషియల్‌గా రివీల్ చేయలేదు. రవితేజ తన కెరీర్‌లో ఇంతవరకు టచ్ చేయని ఈ కొత్త రూట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.