సందీప్ హీరోల్లో అతడే ముందా?
మహేష్, బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా టైర్ వన్ హీరోలంతా ఎదురు చూస్తున్నారు.;
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సందీప్ లైనప్ లో ? ప్రభాస్ మూడవ హీరో. ఇప్పటికే విజయ్ దేవరకొండ, బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో రెండు సినిమాలు చేసాడు. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దీంతో `స్పిరిట్` పై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో టాలీవుడ్ లో సెకెండ్ సక్సెస్ అందుకోవడం లాంఛనమే. సందీప్ సక్సస్ చూసి అతడితో సినిమాలు చేయాలని చాలా మంది హీరోలు క్యూలో ఉన్నారు. మహేష్, బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా టైర్ వన్ హీరోలంతా ఎదురు చూస్తున్నారు.
వాళ్లే కాకుండా సందీప్ తో పనిచేసే అవకాశం వస్తే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉంటుందా? అని భావించే వాళ్లు ఇంకెంతో మంది. మరి ప్రభాస్ తర్వాత సందీప్ హీరో ఎవరవుతారు? అంటే సూపర్ స్టార్ మహేష్ పేరు చెబుతారంతా. ఎందుకంటే ఇప్పటికే మహేష్ కి ..సందీప్ ఓ స్టోరీ కూడా చెప్పాడు. `యానిమల్` సినిమా చేస్తోన్న సమయంలోనే ఆ సన్నివేశం చోటు చేసుకుంది. కానీ ఆ స్టోరీని మహేష్ రిజెక్ట్ చేసాడు. సందీప్ ను వదులకోవడం ఇష్టం లేక మరో స్టోరీ రెడీ చేసుకుని రమ్మన్నాడు. అలా వెళ్లినప్పుడు ..సందీప్ స్టోరీ నచ్చిందనుకుంటే మహేష్ వెంటనే డేట్లు ఇవ్వగలడు. ఎంత బిజీగా ఉన్నా? సందీప్ లాంటి మేకర్ ని వదలుకోవడ ఇష్టం లేక లాక్ చేస్తారు.
మరి మహేష్ విషయంలో సందీప్ అంత పాజిటివ్ గా ఉన్నాడా? అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే? మహేష్ కంటే ముందే సందీప్ మరో హీరోతో పని చేయాలి అన్న ఆసక్తితో ఉన్నాడు అన్న విషయం వెలుగులోకి వచ్చింది. `స్పిరిట్` తర్వాత సందీప్ బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో `యానిమల్ పార్క్` తెర కెక్కిస్తాడు. ఈ సినిమా అనంతరం కొంత గ్యాప్ తీసుకుని మహేష్ కి బధులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సిద్దం చేస్తాడని తెలిసింది. మహేష్, బన్నీలో సందీప్ ముందుగా ఏ హీరోతో సినిమా చేస్తాడు? అనే చర్చ సందీప్ స్నేహితుల మధ్య రాగా? బన్నీ పేరే అక్కడ హైలైట్ అయింది.
సందీప్ కూడా బన్నీతోనే చేద్దామని హింట్ ఇచ్చాడుట. సందీప్ లో ఈ మార్పు కు కారణం పుష్ప రాజ్ పాత్రలో బన్నీ అభినయమని అంటున్నారు. `పుష్ప 2` చూసిన తర్వాత సందీప్ బన్నీ విషయంలో మరింత పాజిటివ్ గా ఉన్నాడని..తాను రాసే హీరో క్యారక్టరైజేషన్ కి బన్నీ పర్పెక్ట్ గా న్యాయం చేయగల్గు తాడని నమ్ముతున్నాడుట. ఈ నేపథ్యంలో మహష్ కంటే ముందే బన్నీతో ముందుకెళ్తేనే మంచి రిజల్ట్ కు అస్కారం ఉంటుందని భావిస్తు న్నాడుట.