హీరోలు..డైరెక్టర్లు అలా అడ్జస్ట్ అవుతున్నారు!
పాన్ ఇండియా హీరోలు..పాన్ ఇండియా డైరెక్టర్లు. ఇలా కొన్ని కాంబినేషన్స్ సెట్ అయిపోయాయి.;
పాన్ ఇండియా హీరోలు..పాన్ ఇండియా డైరెక్టర్లు. ఇలా కొన్ని కాంబినేషన్స్ సెట్ అయిపోయాయి. ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్, ప్రభాస్- సందీప్ రెడ్డి, హనురాఘవూడి సినిమాలతో బిజీ. త్వరలో `కల్కి 2` మొదలైతే నాగ్ అశ్విన్ కూడా దిగిపోతాడు. రామ్ చరణ్ -బుచ్చిబాబు `పెద్ది`తో బిజీ. బన్నీ-అట్లీ అంతే బిజీగా ఉన్నారు. మహేష్-రాజమౌళి `వారణాసి`తో బిజీ బిజీగా గడుపుతున్నారు. యశ్-గీతూమోహన్ దాస్ `టాక్సిక్` పూర్తి చేసే పనిలో ఉన్నారు. రిషబ్ శెట్టి `జైహనుమాన్`, `ఛత్రపతి శివాజీ మహారాజ్` సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.
ఇలా కొన్ని కాంబినేషన్స్ ఫిక్స్ అయిపోయాయి. ఇంకా ఇతర హీరోలు...డైరెక్టర్లు అలాగే ఫిక్సై పని చేస్తున్నారు. అయితే మరికొంత మంది స్టార్లు...డైరెక్టర్లు మాత్రం అడ్జస్ట్ అయి పని చేస్తున్నారు. ఓ హీరో ఖాళీగా ఉండటం ఇష్టం లేక నచ్చిన దర్శకుడు సెట్ అవ్వక...దొరికిన దర్శకుడితో అడ్జస్ట్ అవుతున్నారు. అలాగే డైరెక్టర్లు కూడా తాను పని చేయాలనుకున్న హీరోతో కాకుండా ఇంతర హీరోలతో రాజీ పడి పని చేస్తున్నారు. ఇలా చేయకపోతే సమయం వృద్ధాగా పోతుంది. తద్వారా బోలెడంత నష్టం జరుగుతుంది. కావాల్సిన హీరో కోసమో..దర్శకుడి కోసమో ఎదురు చూస్తే? సమయం వృద్దా తప్ప దమ్మిడి ఆదాయం ఉండటం లేదు.
ఇంకా ఈ గ్యాప్లో సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకవేళ నమ్మకంగా ఎదురు చూసినా? ఆ హీరో డైరెక్టర్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడా? అంటే అదీ చెప్పలేం. అంతకన్నా గొప్ప స్టోరీ తగిలిందంటే ముందుగా ఆ డైరెక్టర్ తో ముందుకెళ్లిపోతున్నాడు. డైరెక్టర్ విషయంలో కూడా ఇదే సన్నివేశం ఎదురవుతుంది. దీంతో హీరోలు-డైరెక్టర్లు తాము అనుకున్న వారితో కాకుండా రాజీ పడి పని చేయాల్సి వస్తోంది. పాన్ ఇండియాలో హిట్ కొట్టిన చందు మొండేటి `తండేల్` హిట్ తర్వాత ఖాళీగా ఉన్నాడు. తాను పని చేయాలనుకున్న హీరోలంతా బిజీగా ఉన్నారు.
దీంతో `వాయుపుత్ర` అనే యానిమేటెడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా సినిమా తీయాలనుకున్నాడు. కానీ హీరో సెట్ అవ్వక రీజనల్ మార్కెట్ ఉన్న స్టార్ కే కమిట్ అయ్యాడు. `జై హనుమాన్` తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మకి పాన్ ఇండియా హీరో సెట్ అవ్వక అతడు ఖాళీగానే ఉన్నాడు. క్లాసిక్ డైరెక్టర్ శివ, గౌతమ్ తిన్ననూరి, కొరటాల శివ కూడా స్టార్ హీరోల కోసం ఎదురు చూస్తు కాలం గడుపుతున్నారు.