ఒర్రీ ఓవరాక్షన్ .. అందుకేనా హీరోయిన్లతో కటీఫ్!
నేటి జెన్ జెడ్ స్టార్ కిడ్స్, యువ నటీమణులే కాదు, కొంచెం సీనియర్ నటీమణులు కూడా అతడంటే పడి చస్తారు. ఒర్రీతో చనువుగా ఫోటోలు దిగుతారు.;
ఒర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి బాలీవుడ్ సర్కిల్స్ కి అత్యంత సన్నిహితమైన పేరు. హై ప్రొఫైల్ గాళ్స్ అత్యంత ఇష్టపడే పేరు కూడా ఇదే. అతడితో సెల్ఫీ క్లిక్ చేయనిదే, గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోనిదే నిదురపోలేని గాళ్స్ ఉన్నారు.
నేటి జెన్ జెడ్ స్టార్ కిడ్స్, యువ నటీమణులే కాదు, కొంచెం సీనియర్ నటీమణులు కూడా అతడంటే పడి చస్తారు. ఒర్రీతో చనువుగా ఫోటోలు దిగుతారు. సెల్ఫీల కోసం ఆరాటపడతారు. అతడు అంతగా ఎంటర్ టైన్ చేస్తాడు గనుకనే ప్రతి పార్టీకి ఇన్వయిట్ చేస్తారు. పార్టీలో అందరినీ ఉర్రూతలూగించడం అతడి పని. అందుకు అతడు ఫీజు కూడా వసూలు చేస్తారు. ఇలాంటి వ్యక్తులను స్టాండప్ కమెడియన్లు అనాలా? లేక పార్టీ హోస్ట్ లు అనాలా తెలీదు కానీ, ఒర్రీ ఉంటే చాలు పార్టీ అదిరిపోతుంది.
అదంతా సరే కానీ, ఇటీవల ఒర్రీ ఓవరాక్షన్ ఎక్కువైనట్టే కనిపిస్తోంది. అతడు వేసే వెర్రి వేషాలు కొందరికి నచ్చడం లేదు. దీంతో అతడిని సోషల్ మీడియాల్లో అన్ ఫాలో చేస్తున్నారు. ఇదే కేటగిరీలోకి చేరారు సారా అలీఖాన్, పాలక్ తివారీ. ఆ ఇద్దరూ ఇటీవల ఒర్రీని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో అది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అంతగా ఒర్రీ ఏం తప్పు చేసాడు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
బాలీవుడ్ సోషల్ మీడియా సర్కిల్స్‌లో అకస్మాత్తుగా ఒక ఊహించని పరిణామం చర్చగా మారింది. అది ఇప్పుడు `ఒర్రీ వర్సెస్ ఖాన్ సిబ్లింగ్స్` ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఒర్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు వరస్ట్ పేర్లు (అత్యంత దారుణమైన మూడు పేర్లు) అనే టైటిల్‌తో ఒక రీల్ పోస్ట్ చేశారు. అందులో సారా, పాలక్, అమృత అనే పేర్లను ప్రస్తావించారు. నేరుగా ఇంటి పేర్లు చెప్పనందున.. నెటిజన్లు వీటిని విశ్లేషించారు. సారా అంటే సారా అలీ ఖాన్, పాలక్ అంటే పాలక్ తివారీ (ఇబ్రహీం అలీ ఖాన్ సన్నిహితురాలు, గర్ల్ ఫ్రెండ్) , అమృత అంటే అమృత సింగ్ (సారా, ఇబ్రహీంల తల్లి). ఆ మూడు పేర్లు ఖాన్ కుటుంబంతో లింకప్ అయి ఉన్నాయి.
దీంతో వెంటనే ఖాన్ సిబ్లింగ్స్ రియాక్షన్ కూడా అంతే సూటిగా ఉంది. తన తల్లి, సోదరి, స్నేహితురాలి పేర్లను అలా బహిరంగంగా ఎగతాళి చేయడంపై ఇబ్రహీం అలీ ఖాన్ తీవ్రంగా స్పందించారు. వెంటనే అతడు ఒర్రీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు. సోదరుడిని అనుసరిస్తూ సారా అలీ ఖాన్ కూడా ఒర్రీని అన్‌ఫాలో చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
నిజానికి సారా అలీ ఖాన్, ఒర్రీ కాలేజ్ రోజుల నుంచి మంచి స్నేహితులు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య సఖ్యత లేదని వార్తలు వస్తున్నాయి. గతంలో పలక్ తివారీతో కూడా ఒర్రీకి వాట్సాప్‌లో గొడవ జరిగిన స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యాయి. పాలక్ సారీ చెప్పినా ఒర్రీ మిడిల్ ఫింగర్ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఇప్పుడు నేరుగా సారా తల్లి అమృత సింగ్ పేరును కూడా ఇందులో లాగడంతో ఖాన్ కుటుంబం దీనిని సీరియస్‌గా తీసుకున్నట్లు అర్థమవుతోంది.
సోషల్ మీడియాలో చాలా మంది సారా , ఇబ్రహీం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. స్నేహం పేరుతో తల్లిని, సోదరిని అవమానిస్తే ఎవరూ సహించరు! అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఒర్రీ మాత్రం ఈ వివాదంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.
సెలబ్రిటీల మధ్య ఉండే ఇలాంటి `ఈ-వార్స్` కొన్నిసార్లు అదుపు తప్పే ప్రమాదం కనిపిస్తోంది. ఖాన్ ఫ్యామిలీ అభిమానులు మూకుమ్మడిగా ఇప్పుడు ఒర్రీ మీదికి దాడికి దిగారు. అయితే ఒర్రీ తనకు గుర్తింపు తగ్గుతోంది అని అనుకోగానే, ఇలా ఏదో ఒకటి క్రియేట్ చేస్తుంటాడని, తద్వారా తన ఫాలోవర్స్ ని పెంచుకుంటాడని కూడా చాలా చర్చ సాగుతోంది. ఏదో ఒకటి చేయనిదే ఈ రోజుల్లో ఉచిత ప్రచారం ఎలా దక్కుతుంది? అని కొందరు కామెంట్ చేస్తున్నారు.