ఇప్పటికే సమస్యలు.. మరి ఆ హీరో ఏం చేస్తారో?

ప్రస్తుతం నిర్మాత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వెంటనే కొత్త సినిమా ప్రారంభిస్తే మధ్యలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.;

Update: 2026-03-15 06:16 GMT

టాలీవుడ్‌ లోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన ఒక కొత్త ప్రొడక్షన్ బ్యానర్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. వరుసగా భారీ ప్రాజెక్టులు ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఆ బ్యానర్ ఇప్పుడు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ బ్యానర్‌ తో సినిమా చేయబోతున్న ఒక స్టార్ హీరో తన నిర్ణయం మార్చుకుంటారా అనే అంశం హాట్ టాపిక్‌ గా మారింది.

అయితే ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఇద్దరు ప్రముఖ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. కానీ ఆ సినిమాల్లో ఒకటి విడుదలకు ఇంకా లైన్ క్లియర్ చేసుకోలేకపోయింది. మరో సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో ప్రకటించిన సమయానికి ఆ రెండు చిత్రాలు థియేటర్లకు రాకపోవడం నిర్మాతకు ఆర్థికంగా ఒత్తిడిని పెంచిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అదే సమయంలో ఆ నిర్మాణ సంస్థ మరో భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక స్టార్ హీరో, సక్సెస్ ఫుల్ దర్శకుడి కాంబినేషన్‌ లో ఆ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్టు పై ఇప్పటికే టాలీవుడ్‌ లో చర్చ కూడా మొదలైంది. అయితే ప్రస్తుతం పరిస్థితి పరిశీలించి కొందరు.. ఆ స్టార్ హీరోకు జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నిర్మాత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వెంటనే కొత్త సినిమా ప్రారంభిస్తే మధ్యలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఫైనాన్స్ సమస్యలు తీవ్రంగా ఉంటే సినిమా షూటింగ్ మధ్యలో నిలిచిపోవచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది ఇలాంటి సందర్భాల్లో హీరోలు కూడా సాధారణంగా ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

నిర్మాత పరిస్థితులు, ప్రాజెక్టు బడ్జెట్, ఫైనాన్స్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఆ ప్రాజెక్టుపై ఆ స్టార్ హీరో ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు నిర్మాత మాత్రం ఆశలు వదులుకోకుండా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్లాన్ చేసిన ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే పరిస్థితులు అనుకూలంగా మారితేనే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశముందని అంటున్నారు. మొత్తంగా చూస్తే భారీ బడ్జెట్ సినిమాలతో సంచలనం సృష్టించిన ఆ కొత్త బ్యానర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరో తీసుకునే నిర్ణయం ఆ బ్యానర్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ టాలీవుడ్‌ లో కొనసాగుతోంది. ఇప్పుడు హీరో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News