పాస్ వర్డ్‌ షేరింగ్.. నెట్ ఫ్లిక్స్ సరికొత్త ఎత్తుగడ

Update: 2022-04-24 17:30 GMT
ఇండియాలో కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఓటీటీ మార్కెట్‌ రెండు మూడు వందల రెట్లు పెరిగింది అంటూ మార్గెట్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు లేని సమయంలో ఓటీటీ ఖాతాదారులుగా చేసిన వారు థియేటర్లు మళ్లీ ప్రారంభం అయిన తర్వాత కూడా తమ ఖాతాను కొనసాగిస్తూ డబ్బులు చెల్లిస్తూ ఓటీటీ లపై ఆసక్తిని కనబర్చుతూ ఉన్నారు.

ఇక ఇండియాతో పాటు పలు దేశాల్లో దాదాపు అన్ని ఓటీటీ లకు సంబంధించిన పాస్ వర్డ్‌ లను సన్నిహితులతో షేర్‌ చేసుకోవడం చాలా కామన్ విషయం. అమెజాన్ వంటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ను విచ్చలవిడిగా పాస్ వర్డ్‌ షేర్‌ చేసుకుని వినియోగించేస్తున్నారు. పది మంది వరకు అమెజాన్ ప్రైమ్‌ పాస్ వర్డ్‌ షేర్‌ చేసుకుని ఒక్క ఖాతాతో మొత్తం కంటెంట్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా నెట్‌ ఫ్లిక్స్ కూడా అంతే ఉండేది. కాని నెట్‌ ఫ్లిక్స్ వారు తమ పాలసీని మార్చారు.

ఇక మీదట పాస్ వర్డ్‌ షేరింగ్‌ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఒక్క అకౌంట్‌ యాక్టివేట్‌ లో ఉండేలా చేశారు. ఒకే సారి రెండు మూడు అంతకు మించిన డివైజ్ ల్లో నెట్ ఫ్లిక్స్ ఇక మీదట లాగిన్ అయ్యి ఉండే అవకాశం లేదు. ఒక చోట లాగిన్ అయితే మరో చోట లాగ్ ఔట్‌ అవుతుంది. దీని వల్ల తమ వినియోగదారులు పెరుగుతారని నెట్ ఫ్లిక్స్ వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పాస్ వర్డ్‌ షేరింగ్‌ ఆప్షన్ ను సరికొత్తగా నెట్‌ ఫ్లిక్స్ వారు తీసుకు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో ఒక్క అకౌంట్‌ కు డబ్బు చెల్లించి చాలా డివైజ్‌ ల్లో వినియోగించే వీలు ఉండేది. కాని ఇప్పుడు ఒక అకౌంట్‌ నుండి పాస్ వర్డ్‌ షేరింగ్ చేసే సబ్‌ అకౌంట్ గా పరిగణించబడుతుంది. తద్వారా అమౌంట్‌ ను చెల్లించాల్సి ఉంటుందట. అయితే సబ్‌ అకౌంట్‌ కు అమౌంట్‌ తక్కువ చెల్లిస్తే సరిపోతుందట.

ప్రస్తుతం ఈ పద్దతిని పైలెట్‌ ప్రాజెక్ట్‌ గా కొన్ని చోట్ల పరిశీలిస్తున్నారు. అక్కడ సక్సెస్ అయితే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఆ సబ్‌ అకౌంట్‌ పద్దతిని అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయట. సబ్‌ అకౌంట్‌ అంటే ఏంటీ అంటే.... ఒక వ్యక్తి నెట్‌ ఫ్లిక్స్ ఖాతాదారుడిగా ఉన్నాడు. అతడు సంవత్సరంకు గాను ప్లాన్ తీసుకున్నాడు.

అతడు తన పాస్ వర్డ్‌ షేర్‌ చేసి సబ్‌ అకౌంట్‌ గా మరోకరిని జాయిన్ చేయడం ద్వారా ప్లాన్‌ విలువ తగ్గడం తో పాటు ఈజీగా కొత్త ఖాతాదారుగా చేరిపోవచ్చు. కాస్త కొత్తగా అర్థం కాకుండా ఉన్నా కూడా ఈ ప్లాన్ వల్ల నెట్ ఫ్లిక్స్ వారికి భారీగా కొత్త ఖాతాదారులు జాయిన్ అవుతారంటూ మార్కెట్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News