డేటింగ్ వార్త‌లపై కొడుకుతో క‌లిసి న‌వ్వుకుంటున్నా!

అనవసరమైన గాసిప్స్ వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోవడం ఇష్టం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.;

Update: 2026-03-27 14:30 GMT

ఫిట్‌నెస్ ఐకాన్ మలైకా అరోరా వ్యక్తిగత జీవితంపై నిరంతరం పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. అయినా వీటిని మ‌లైకా ఎంతో లైట్ తీసుకుంటుంది. తాజాగా వీటిపై అమ్మ‌డు మనసు విప్పి మాట్లాడారు. సెలబ్రిటీల జీవితాల్లో డేటింగ్ వార్తలు సర్వసాధారణం అయినప్పటికీ కొన్నిసార్లు అవి హద్దులు దాటి విసుగు తెప్పిస్తుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే గతంలో ఇలాంటి వార్తలు తనను ఎంతో కలవరపెట్టేవని కానీ ఇప్పుడు వాటిని ఎదుర్కోవడంలో తన దృక్పథం పూర్తిగా మారిపోయిందన్నారు. మలైకా వచ్చే పుకార్లను ఇప్పుడు చాలా సరదాగా తీసుకుంటున్నారు.

ముఖ్యంగా తన కుమారుడు అర్హాన్ ఖాన్ తో కలిసి ఆ వార్తలను చదువుతూ నవ్వుకుంటానని ఆమె వెల్లడించారు. `కొన్నిసార్లు నా గురించి వచ్చే కథనాలు ఎంత విడ్డూరంగా ఉంటాయంటే మేమిద్దరం వాటిని చూసి ఆశ్చర్యపోతుంటాం. ఆ వార్తల్లోని అసత్యాలను చూసి నవ్వుకోవడం ఇప్పుడు మాకు అలవాటైపోయింది` అని ఆమె చెప్పుకొచ్చారు. అర్హాన్ చాలా పరిణతి చెందిన వ్యక్తని, తన వ్యక్తిగత నిర్ణయాలను , తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను వాడు సరిగ్గా అర్థం చేసుకుంటాడని మలైకా సంతోషం వ్యక్తం చేశారు.

తల్లి కొడుకుల మధ్య ఉన్న ఈ పారదర్శకత వల్లే బయట ప్రపంచంలో తన గురించి ఎన్ని నెగిటివ్ వార్తలు వచ్చినా తను స్థిరంగా ఉండగలుగుతున్నానని మ‌లైకా వివరించారు. అర్హాన్ ఇచ్చే మద్దతు తనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందన్నారు. గతంలో నటుడు అర్జున్ కపూర్‌తో బ్రేకప్ వార్తలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. ఇలాంటి సమయాల్లో మౌనంగా ఉండటమే శ్రేయస్కరమని మలైకా భావించారు. ప్రతి చిన్న విషయానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని తన పని , తన కుటుంబం తనకు ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు.

అనవసరమైన గాసిప్స్ వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోవడం ఇష్టం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. మలైకా అరోరా తనపై వచ్చే విమర్శలను ,పుకార్లను చాలా పాజిటివ్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. నెగిటివిటీని దరిచేరనీయకుండా తన కొడుకుతో కలిసి సంతోషంగా గడపడమే లక్ష్యమని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. ఒక సెలబ్రిటీగా పుకార్లను ఎలా తట్టుకోవాలో? వాటిని ఎలా నవ్వుతూ కొట్టిపారే యాలో? ఆమె నేటి తరం నటీమణులకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రెఫోష‌న‌ల్ గా మ‌లైకా అరోరా అంత బిజీగా లేద‌రు. వ‌య‌సు మీద ప‌డ‌టం, కొత్త భామ‌లు అందుబాటులో ఉండ‌టంతో అవ‌కాశాలు త‌గ్గాయి. అయినా అమ్మ‌డు ఫిట్ నెస్ మాత్రం అశ్ర‌ద్ద చేయ‌లేదు. డే లో కొంత స‌మాయాన్ని జిమ్ , యోగాల‌కు కేటాయిస్తున్నారు.

Tags:    

Similar News