హీరోల రూట్ ఛేంజ్ - క్లాస్ టు మాస్!

అదే సమయంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో న‌టిస్తోన్న `స్పిరిట్` సినిమాలో రూత్‌లెస్ కాప్ గా తనలోని రౌద్ర రసాన్ని ప్రదర్శించబోతున్నారు. ఒకే సమయంలో ఇంతటి వైవిధ్యం చూపడం ప్రభాస్ కే చెల్లింది.;

Update: 2026-03-27 17:30 GMT

ప్రస్తుతం టాలీవుడ్ హీరోల ఇమేజ్ మేకోవర్ అనే కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు ఒకే తరహా పాత్రలతో సరిపెట్టుకున్న స్టార్ హీరోలంతా రూట్ మార్చి ప్రేక్షకుల్ని స‌ర్ ప్రైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లాస్ నుండి మాస్ కు, పక్కా మాస్ నుండి సాఫ్ట్ క్లాస్ పాత్రల వైపు హీరోలు అడుగులు వేస్తున్నారు. ఈ మార్పు కేవలం నటనలోనే కాకుండా వారి బాడీ లాంగ్వేజ్ , లుక్స్ విషయంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తదుపరి దర్శకుడు బాబీతో కలిసి మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే.

`వాల్తేరు వీరయ్య` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్లో చిరంజీవి మ‌రోసారి పూర్తి స్థాయిలో ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నారు. గత కొన్ని సినిమాల్లో కాస్త క్లాస్ , మెసేజ్ ఓరియంటెడ్ పాత్రలు చేసిన మెగాస్టార్ ఇప్పుడు మళ్ళీ తన వింటేజ్ మాస్ అవతారంలోకి మారిపోవడం మెగా అభిమానుల్లో జోష్ ని నింపుతోంది. ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్ థియేటర్లను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వరుసగా మాస్ యాక్షన్ సినిమాలతో అలరించిన ఆయన తాజాగా `ఇరుమూడి` అనే చిత్రంతో తనలోని క్లాస్ నటుడిని బయటకు తీస్తున్నారు.

ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషన్స్ , హృదయాన్ని హత్తుకునే కథాంశంతో సాగే సినిమా. రవితేజ తన రెగ్యులర్ మేనరిజమ్స్ పక్కన పెట్టి చాలా సెటిల్డ్ గా, క్లాస్ లుక్‌లో కనిపించబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

గ్లోబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లోనే అత్యంత వైవిధ్యమైన దశలో ఉన్నారు. `కల్కి2898` వంటి సైన్స్ ఫిక్షన్ హిట్ తర్వాత ఆయన ఎంచుకుంటున్న పాత్రలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న `ఫౌజీ` చిత్రంలో ప్రభాస్ ఒక గంభీరమైన సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు.

అదే సమయంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో న‌టిస్తోన్న `స్పిరిట్` సినిమాలో రూత్‌లెస్ కాప్ గా తనలోని రౌద్ర రసాన్ని ప్రదర్శించబోతున్నారు. ఒకే సమయంలో ఇంతటి వైవిధ్యం చూపడం ప్రభాస్ కే చెల్లింది.

ఈ రూట్ ఛేంజ్ అనేది హీరోల మార్కెట్‌ను పెంచడమే కాదు. ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఒకే తరహా పాత్రలు చేస్తే వచ్చే బోర్ నుంచి తప్పుకోవడానికి హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడాలంటే? నటుడిగా తమలోని అన్ని కోణాలను ఆవిష్కరించాలని వారు భావిస్తున్నారు. అందుకే ఇమేజ్ కు లోబడకుండా? కథ డిమాండ్ మేరకు తమను తాము మలచుకుంటున్నారు.

మొత్తానికి టాలీవుడ్ టాప్ హీరోలందరూ ఇప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ చేయడానికి ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. చిరంజీవి మాస్ పవర్, రవితేజ క్లాస్ టచ్, ప్రభాస్ విభిన్న అవతారాలు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి. ఏదేమైనా హీరోల మధ్య జరుగుతున్న ఈ హెల్తీ కాంపిటీషన్ , మేకోవర్ ప్రయోగాలు తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తున్నాయని చెప్పొచ్చు.

Tags:    

Similar News