కియ‌రా లుక్‌కి అన‌న్య అసూయ చూసారా!

ఓ అవార్డుల‌ వేడుకలో బాలీవుడ్ భామలు కియారా అద్వానీ, అనన్యా పాండేల మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2026-03-27 22:30 GMT

ఇరువురు భామ‌ల న‌డుమ కోల్డ్ వార్ గురించి ఎక్కువ‌గా వినిపిస్తుంటుంది. ఒక‌రితో ఒక‌రు స‌ఖ్యంగా ఉండ‌టం అనేది చాలా అరుదు. ఓ అవార్డుల‌ వేడుకలో బాలీవుడ్ భామలు కియారా అద్వానీ, అనన్యా పాండేల మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుక‌కు సంబంధించిన ఒక వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ ఈవెంట్‌లో కియారా అద్వానీ ధరించిన డ్రెస్.. దానికి అనన్యా స్పందించిన తీరు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

ఈ వేడుకలో కియారా అద్వానీ తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. త‌ను ధరించిన చాక్లెట్ బ్రౌన్ లెదర్ కోర్సెట్ స్టైల్ బాడీసూట్ ఆ వేడుక‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన బోల్డ్ అండ్ స్టైలిష్ లుక్‌తో రెడ్ కార్పెట్‌పై నడుస్తూ అందరి కళ్ళూ తనవైపే తిప్పుకునేలా చేసింది. ఈ అద్భుతమైన ఫ్యాషన్ ఛాయిస్ కారణంగానే ఈ 5వ ఎడిషన్ వేడుకలో `ఫ్యాషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్` అవార్డును కూడా సొంతం చేసుకుంది.

అయితే ఈ అవార్డుల వేడుకలో కియారా..అనన్యా పాండే ఒకరినొకరు పలకరించుకుంటున్న సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటన నెటిజ‌నుల్లో విస్త్ర‌త చ‌ర్చ‌కు దారితీసింది. కియారాతో మాట్లాడుతున్నప్పుడు అనన్యా ఆమె వైపు పదేపదే చూడటం.. ముఖ కవళికలు కొంచెం భిన్నంగా ఉండటంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అనన్యా పాండే, కియారా లుక్ చూసి అసౌకర్యానికి గురైందని .. ఆ అందాన్ని చూసి అసూయ పడిందని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు నెటిజన్లు ఈ విషయాన్ని మరింత తీవ్రం చేస్తూ ``మహిళల అసూయ ఇక్కడ పీక్స్‌కు చేరింది`` అనే క్యాప్షన్లతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఎడిటింగ్ మాయాజాలమని మరికొందరు వాదిస్తున్నారు. ఒక సాధారణ సంభాషణను స్లో మోషన్ క్లిప్స్‌గా మార్చడం వల్ల అనన్యా చూపులు అసూయగా కనిపిస్తున్నాయని నిజానికి ఈ భామ‌ కేవలం తన తోటి నటి అద్భుతమైన స్టైల్‌ను చూసి ముగ్ధురాలై ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు.

ఏది ఏమైనా కానీ.. ఒక అవార్డుల వేడుకలో ఈ రేర్ మూవ్ మెంట్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ రాత్రి కియారా అద్వానీ తన ఫ్యాషన్ పవర్‌ను నిరూపించుకోగా.. అనన్యా పాండే రియాక్షన్ మాత్రం వైరల్ వివాదాలకు కేంద్రబిందువు అయింది. సోషల్ మీడియాలో ఎన్ని భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనా.. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతూనే ఉంది. అన‌న్య పాండే కెరీర్ స‌రైన విజ‌యాల్లేక నెమ్మ‌దించిన సంగ‌తి తెలిసిందే. కియ‌రా అద్వాణీ పెళ్లి , బిడ్డ‌ను క‌న్న త‌ర్వాత సినిమాల‌కు కొంత గ్యాప్ ఇచ్చింది. ఈ ఇద్ద‌రూ కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

Tags:    

Similar News