'డార్క్' సృష్టిక‌ర్త‌ల‌ 1899 ప్ర‌కంప‌నాలు..?

Update: 2022-09-18 09:30 GMT
పాపుల‌ర్ ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ `డార్క్` ఇటీవలి కాలంలో అత్యంత విజయవంతమైన OTT షోలలో ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సిరీస్ ప్రీమియర్స్ వీక్షించిన‌ తర్వాత దాని గురించి ట్వీట్ చేశారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ 1899 అనే మరొక ర‌క్తి క‌ట్టించే అస‌క్తిక‌ర డ్రామా సిరీస్ తో వస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సిరీస్ ను `డార్క్` కి ప‌ని చేసిన‌  క్రియేట‌ర్స్ నుంచి వ‌స్తుండ‌డం...

క‌థాంశం విష‌యానికి వస్తే... 1899 నవంబర్ 24న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవుతుంది. ఇదే విషయాన్ని త్వరలోనే నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించనుంది. `డార్క్‌`ని సృష్టించిన బరన్ బో ఓడార్ -జాంట్జే ఫ్రైసే 1899 వెనుక ఉన్న సృజనాత్మక హెడ్స్ గా మ‌రోసారి వైవిధ్యాన్ని చాటుతార‌ని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో నెట్ ఫ్లిక్స్ నుండి అత్యంత ఎదురుచూస్తున్న (మోస్ట్ అవైటెడ్) సిరీస్ లలో ఇది ఒకటి.

గేమ్ మారుతోంది సుమీ..!

1984లో జరిగిన యాంటీ సిక్ ఉద్యమం నేపథ్యంతో తెర‌కెక్కిన `జోగి` ఈ నెల 16న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగుకి రానుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. 1930నాటి పీరియడ్ డ్రామా ఖల మిస్టరీ థ్రిల్ల‌ర్. న‌ట‌వార‌సుల‌ను ప‌రిచ‌యం చేస్తూ జోయా అక్తర్ తెర‌కెక్కిస్తున్న ది ఆర్చీస్ కొంద‌రి భ‌విష్యత్ ని నిర్ధేశిస్తుంది. న‌ట‌వార‌సులు సుహానా ఖాన్- ఖుషీ క‌పూర్- అగ‌స్త్య నంద ఈ సిరీస్ తో తెరంగేట్రం చేయ‌డం ఉత్కంఠ‌ను పెంచుతోంది. సాన్య మల్హోత్రా క‌థ‌ల్ కూడా రానుంది. అనుష్క శర్మ క్రికెటర్ గా నటించిన `చక్ దా ఎక్స్ ప్రెస్`- తమన్నా `ప్లాన్ ఏ ప్లాన్ బి`... యామి- చోర్ నికల్ కె భాగా కూడా ఆస‌క్తిని పెంచుతున్నాయి. రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో రూపొందిన `మోనికా మై డార్లింగ్`.. మిస్టరీ క‌థాంశంతో టబు ప్రధాన పాత్రలో విశాల్ భరద్వాజ్ ఖుఫియా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇవ‌న్నీ నెట్ ఫ్లిక్స్ ఒరిజిన‌ల్స్ కావ‌డంతో చాలా ఆస‌క్తి నెల‌కొంది.

Netflixలో రాబోయే భారతీయ ఒరిజిన‌ల్ సిరీస్ ల‌ను ప‌రిశీలిస్తే..
ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 -జమతారా సీజన్ 2-రానా నాయుడు- మసాబా మసాబా సీజన్ 2- హీరమండి-ఖుఫియా క్యూలో ఉన్నాయి.

ఢిల్లీ క్రైమ్ S2 ఇండియన్ ఒరిజినల్ నెట్ ఫ్లిక్స్ లో రానుంది. ఈ క్రైమ్ సిరీస్ లో మొదటి సీజన్. ఢిల్లీ క్రైమ్ భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా చాలా గౌరవం ద‌క్కించుకుంది. ఎమ్మీ అవార్డ్-విజేత న‌టించిన ఈ సిరీస్ ఈ సంవత్సరం రెండవ సీజ‌న్ కోసం రెడీ అవుతున్నారు.  దేశాన్ని కుదిపేసిన కేసును ఛేదించిన తర్వాత IPS అధికారిణి వర్తికా చతుర్వేది (షెఫాలీ షా) ఆమె బృందం కొత్త సవాల్ కు సిద్ధమ‌వుతుంది. ప్రజలు భయంతో ఈ పోరాటానికి సహాయం చేస్తారా లేదా? అన్న‌ది చూడాలి.

జమ్తారా: సబ్కా నంబర్ అయేగా (సీజన్ 2) వేడెక్కించ‌నుంది. మరో నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ `జమ్తారా` తిరిగి ఫిషింగ్ ప్రపంచంలోకి దూకుతుంది. పెద్ద ఆటగాళ్ళు జమ్తారాలోకి ప్రవేశిస్తారు. రాజకీయాలు ఫిషింగ్ ను నియంత్రించడానికి ప్రయత్నిస్తాయి. అయితే ఫిషింగ్ రాజకీయాలను నియంత్రించడంలో జ‌మ్తారా స‌ఫ‌ల‌మ‌వుతుంది. షో మొదటి సీజన్ ని చూడకుంటే ఇప్పుడు సీజ‌న్ 2 కంటే ముందే దానిని వీక్షించాలి. ఆ త‌ర్వాత సీజ‌న్ 2లో జాయిన‌వ్వొచ్చు.

బాలీవుడ్ స్టార్స్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి ఫోన్ చేస్తారు?  స్ట్రీమింగుకు రానున్న‌ ఈ క్రైమ్ డ్రామాలో తెలుగు సూపర్ స్టార్ లు రానా దగ్గుబాటి- వెంకటేష్ దగ్గుబాటి న‌టించారు. ధనవంతులు పాపుల‌ర్ ప‌ర్స‌నాలిటీస్ కి సమస్య ల పరిష్కారాలు ఇచ్చేవాళ్లుగా వారు కనిపిస్తారు. ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఈ సిరీస్ నెట్  ఫ్లిక్స్ ఇండియన్ ఒరిజినల్ లో విడుద‌ల‌వుతుంది.

మసాబా మసాబా (సీజన్ 2) ఆస‌క్తిని క‌లిగించ‌నుంది. ఇది కఠినమైన ప్రపంచం.. కానీ మసాబా.. నీనా గుప్తాలు ఇంకా కఠినమైనవాళ్లు. ఈసారి ప్రణాళిక ప్రపంచ ఆధిపత్యం సాధించ‌డం గురించి.. మసాబా కెమెరా ముందుకి వెళుతుంది.. నీనా వారి వెనుక వెళ్లాలని నిర్ణయించుకుంది. కొత్త ప్రేమలు పాత ప్రేమలు కొన్ని అసాధ్యమైన ప్రేమలతో ఈ క‌థ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంది. ఇద్దరు ఆడాళ్లు తమ కెరీర్ స్నేహాలను ఎలా న‌డిపిస్తారు? ప్రేమికులను తమ చేతుల్లోకి తీసుకుని ప్రతిదానిని తమవైపు ఎలా తిప్పుకుంటారో తెర‌పై చూస్తారు.
Tags:    

Similar News