• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  NBK107 టీజర్: నటసింహం వేట...

NBK107 టీజర్: నటసింహం వేట మొదలైంది..!!

By - Tupaki Desk
Update: 2022-06-09 13:47 GMT
నటసింహ నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. .

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ - ఇటీవల వచ్చిన మాస్ పోస్టర్ నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో రేపు బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ఒక రోజు ముందు మేకర్స్ ఫస్ట్ హంట్ పేరుతో టీజర్ ని లాంచ్ చేసారు.

'మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్' 'భయం నా బయోడేటాలోనే లేదురా బోషిడికే' 'నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు నా కొడకల్లారా..' అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో కూడిన ఈ పవర్ ప్యాకెడ్ యాక్షన్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇందులో బాలయ్య నెరిసిన గడ్డం - కొత్త హెయిర్ స్టైల్ తో సరికొత్త అవతార్ లో కనిపించారు. కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చొని స్టైలిష్ గా తన ఫేవరేట్ చుట్ట తాగడాన్ని మనం చూడొచ్చు. టీజర్ ని బట్టి చూస్తే   సినిమాలో అతని పాత్రలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఓ వైపు జనాలకు మంచి చేస్తూనే, మరోవైపు శత్రువులకు సింహస్వప్నంగా కనిపిస్తున్నాడు.

#NBK107 లో నటసింహం క్యారెక్టర్ ని దర్శకుడు గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ గా డిజైన్ చేసి తన అభిమాన హీరోపై తన ఫ్యానిజం చూపించాడని చెప్పాలి. టీజర్ లో బాలకృష్ణ రాయల్టీ - ఆయన చెప్పిన డైలాగ్స్ - అద్భుతమైన డైలాగ్ డెలివరీ మరియు మాస్ యాటిట్యూడ్.. ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

రిషి పంజాబీ కెమెరా పనితనం మెచ్చుకోదగినది. విజువల్స్ టాప్ క్లాస్ గా ఉన్నాయి. ఇందులో ఎస్ థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలకృష్ణ పాత్రని ఎలివేట్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ డిజైన్ చాలా లావిష్ గా ఉంది. మొత్తం మీద ఈ ఫస్ట్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడమే కాదు.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.

NBK107 లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చంద్రిక రవి స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనుంది.

నిర్మాతలు నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ మరియు ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే 40% షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.


Full View
Tags:    
  • Balakrishna 
  • NBK107 
  • Gopichand Malineni 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS