• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లోకనాయకుడితో లేడీ సూపర్...

లోకనాయకుడితో లేడీ సూపర్ స్టార్ జతకట్టనుందా..?

By - Tupaki Desk
Update: 2020-04-13 10:10 GMT
ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార. విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే మరో వైపు తనను సూపర్ స్టార్ చేసిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఇప్పటివరకు తమిళంలో అరం, డోరా, కోలమావు కోకిల, ఐరా, కొలైయుదిర్‌కాలం' వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

అయితే అప్పట్లో కమల్ హాసన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘రాఘవన్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2006లో విడుదలై తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. కాగా దాదాపు  14 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క నటించబోతుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా సినీ వర్గాలు సమాచారం ప్రకారం ఈ సినిమాలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరో పక్క నయనతార కంటే కూడా అనుష్కనే ఫైనల్ చెయ్యొచ్చని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇకపోతే గతంలో అనుష్క గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘యెన్నై ఆరిందాల్’ చిత్రంలో నటించగా వీరి కాంబోలో ఒక లేడీ ఒరియెంటెడ్ చిత్రంలో నటించాల్సి ఉండగా అది వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు ‘రాఘవన్ -2’ లో నటించనుందట. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ చిత్ర షూటింగ్‌ లో ఉన్నాడు. అయితే కరోనా వల్ల వాయిదా పడింది. ఆ సినిమా పూర్తయ్యాక ‘రాఘవన్ -2’ చిత్రాన్ని పట్టాలెక్కించనుందని చిత్రబృందం తెలిపిన సమాచారం. మరి కమల్ తో నయనతార డ్రీం తీరనుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Tags:    
  • Nayanthara to team up with Kamal Haasan 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS