నేను రాకపోవడంకు కారణం వాళ్లకు తెలుసు
లేడీ సూపర్ స్టార్ నయనతార అందం ప్లస్ అభినయం ఉన్న నటి. కాగా తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించింది. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఈ భామ లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. హీరోల డామినేషన్ ఎక్కువగా ఉండే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, సత్తా చాటుతోంది నయన్. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని తెలిపింది నయన్. కాగా, తాజాగా మరో విషయమై వెనక్కి తగ్గేది లేదని పేర్కొంటోంది ఈ భామ. ఆ సంగతి ఏంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాల్సిందే.
తనకు కాబోయే భర్త, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ సంస్థ రౌడీ పిక్చర్స్ నిర్మించిన 'నెట్రికన్' చిత్ర ప్రమోషన్స్ సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చింది నయనతార. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ. తాను సినిమా ఒప్పుకునే క్రమంలో ఒప్పంద పత్రాలపై సైన్ చేసే ముందర ప్రమోషన్స్‌కు రాబోనని పేర్కొంటాని, అలా చెప్పాకే సినిమా చేస్తానని చెప్పింది. అందుకే ఎక్కువగా ప్రమోషన్స్‌లో కనిపించనని నయన్ తెలిపింది. అయితే, 'నెట్రికన్' విషయానికొచ్చేసరికి ప్రమోషన్స్‌కు వస్తానని, ముందే చెప్పానని, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం తీస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారని చెప్పింది నయన్. కాగా కొంత మంది దర్శక నిర్మాతలు తాను ఈ సినిమా కోసం ప్రమోషన్స్‌కు హాజరు కాగా తమ సినిమాలకు ఎందుకు రాలేదు? అని ప్రశ్నలు అడుగుతున్నారని, తాను ఎందుకు రాలేదో వారికి తెలుసని సూటిగానే చెప్పింది నయన్.
'నెట్రికన్' ఫిల్మ్ ఓటీటీ డీస్నీ హాట్‌స్టార్‌లో ఆగస్టు 13న విడుదల అయింది. ఈ సినిమా 2011లో వచ్చిన కొరియన్ మూవీ 'బ్లైండ్'ను మాతృకగా తీసుకుని తమిళ నెటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి తీశారు. ఇందులో నయన్ అంధురాలిగా నటించింది. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. మిలింద్ రావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెరీ హై రేటుకు కొనుగోలు చేసింది. ఈ చిత్రంలో నయనతార, అజ్మల్ కీలక పాత్రలు పోషించారు.'నెట్రికన్'లో నయన్ నటకుగాను అవార్డు గ్యారంటీ అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నయన్ ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీ కాంత్ 'అన్నాత్తె'చిత్రంతో పాటు తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో వస్తున్న 'కాతు వాకుల రెండు కాదల్', జి.ఎస్.విక్నేశ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలోనూ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది.