ప‌వ‌న్ సినిమాకు భ‌లే ఛాన్సులే

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రిలీజ్ వేస‌విలో అని చాన్నాళ్ల ముందే నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-01-24 03:55 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమా ఉస్తాద్ భ‌గ‌త్‌ సింగ్‌కు ఒక ద‌శ‌లో పెద్ద‌గా హైపే క‌నిపించ‌లేదు. అందుక్కార‌ణం ఈ సినిమా మొద‌ల‌వ‌డానికే ఏళ్లు గ‌డిచిపోయాయి. చివ‌రికి సినిమాను మొద‌లుపెట్టాక కూడా షూటింగ్ ఎంతోకాలం సాగ‌లేదు. పైగా హ‌రీష్ శంక‌ర్ చివ‌రి చిత్రం మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ డిజాస్ట‌ర్ కావ‌డం.. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రీమేక్ అన్న ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ప‌వ‌న్ అభిమానులు దీని మీద పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోలేదు.

కానీ ఈ మ‌ధ్య ఈ చిత్రానికి బాగానే బ‌జ్ క్రియేట్ అవుతోంది. సినిమా నుంచి రిలీజ్ చేసిన తొలి పాట‌ దేఖ్ లేంగే సాలా ఉస్తాద్‌కు కావాల్సినంత బ‌జ్ తీసుకొచ్చేసింది. ఎన్నో ఏళ్ల త‌ర్వాత ప‌వ‌న్ మాంచి ఫ్లోతో డ్యాన్స్ చేయ‌డం అభిమానుల్లో హుషారు పుట్టించింది. ఇదే సంద‌ర్భంలో ఈ మూవీ రీమేక్ కాద‌న్న వార్త కూడా బ‌య‌టికి రావ‌డం అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచింది. ఈ సినిమాకు సంబంధించి ప‌వ‌న్ ఎప్పుడో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. నెమ్మ‌దిగా పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంటోందీ సినిమా.

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రిలీజ్ వేస‌విలో అని చాన్నాళ్ల ముందే నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఐతే మెగా ఫ్యామిలీకే చెందిన రామ్ చ‌ర‌ణ్, చిరంజీవిల కొత్త సినిమాల రిలీజ్ డేట్లు ఫైన‌లైజ్ అయ్యాక వాటిని బట్టి ప‌వ‌న్ మూవీని షెడ్యూల్ చేయాల‌ని అనుకున్నారు. ఐతే మార్చి 27కు చ‌ర‌ణ్ సినిమా పెద్దిని చాన్నాళ్ల ముందే క‌న్ఫ‌మ్ చేశారు. చిరు మూవీ విశ్వంభ‌ర సంగ‌తే తేల్చాల్సి ఉంది. ఐతే ఈలోపు పెద్ద సినిమా వాయిదా అంటూ ప్ర‌చారం మొద‌లైంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా మార్చి చివ‌రి వారంలో రావ‌డం దాదాపు అసాధ్యంగా క‌నిపిస్తోంది.

షూట్ ఆల‌స్యం కావ‌డానికి తోడు దురంధ‌ర్‌-2కు పోటీగా వెళ్ల‌డం పాన్ ఇండియా మార్కెట్ దృష్ట్యా మంచిది కాద‌ని టీం భావిస్తోంద‌ట‌. అందుకే పెద్దిని వాయిదా వేయ‌డం లాంఛ‌న‌మే అని స‌మాచారం. మ‌రోవైపు నాని మూవీ ది ప్యార‌డైజ్‌ను ఆల్రెడీ మార్చి చివ‌రి వారం నుంచి వాయిదా వేసేశారు. దీంతో ప‌వ‌న్ సినిమాను వేస‌వి ఆరంభంలోనే విడుద‌ల చేయ‌డాడానికి మార్గం సుగ‌మ‌మైంది. కాబ‌ట్టి మార్చి చివ‌రి వారం లేదా ఏప్రిల్ తొలి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేసే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. అంటే వేస‌విలో రాబోయే తొలి పెద్ద సినిమా ఇదే కావ‌చ్చ‌న్న‌మాట‌.

Tags:    

Similar News